విశాఖ జనసంద్రం.. వైయ‌స్‌ జగన్‌ వెంటే జనం

పోలీసుల ఆంక్షలను ఛేదించి పోటెత్తిన ఉత్తరాంధ్ర ప్రజలు

 విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు అశేష జనవాహిని

 అడుగడుగునా వైయ‌స్‌ జగన్‌కు ప్రజల ఘన స్వాగతం

 భారీ సంఖ్యలో మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చిన తీరు

 విశాఖ‌: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఉత్తరాంధ్ర పర్యటనకు అపూర్వ ప్రజాస్పందన లభించింది. పోలీసుల ఆంక్షలు, బారికేడ్లు, నిర్బంధాలను లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివచ్చి వైయ‌స్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రహదారులన్నీ జనవాహినితో నిండిపోయాయి. మహిళలు, యువత, రైతులు, వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి దారి పొడవునా వైయ‌స్‌ జగన్‌కు అభివాదం చేశారు. పలుచోట్ల కాన్వాయ్‌ ఆపి ప్రజలను వైయ‌స్‌ జగన్‌ ఆప్యాయంగా పలకరించగా, ప్రజలు జైకొడుతూ ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు, పోలీసుల ఆంక్షలు ప్రజల ఆదరణ ముందు నిలవలేకపోయాయని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు కనిపించిన అపూర్వ జనసంద్రం ప్రజల్లో వైయ‌స్‌ జగన్‌పై ఉన్న విశ్వాసం, అభిమానానికి నిదర్శనంగా నిలిచిందని తెలిపింది. 

అడుగడుగునా స్వాగతం
విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం బయలుదేరిన వైఎస్‌ జగన్‌కు దారి పొడవునా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికారు. మహిళలు, యువత, రైతులు, వివిధ వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి అభివాదాలు తెలిపారు. పలుచోట్ల కాన్వాయ్‌ నుంచి దిగిన వైయ‌స్‌ జగన్‌ ప్రజల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. చేతులు ఊపుతూ అభివాదం చేసిన ప్రజలకు ఆయన కూడా అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజలతో మమేకమవుతూ వారి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆంక్షలు, బారికేడ్లు, నిర్బంధాల ద్వారా ప్రజలను అడ్డుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు, సంఘీభావం తెలియజేయేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలతో విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ఉత్తరాంధ్ర అంతా జనసంద్రంగా మారిందని తెలిపింది. ఈ అపూర్వ ప్రజాస్పందనతో కూటమి ప్రభుత్వ కుట్రలు, దుష్ప్రచారాలు పటాపంచలయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది.

 

Back to Top