వైయ‌స్ఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు ఇత‌ర రాష్ట్రాల‌కు స్ఫూర్తి

 మహానేత వైయ‌స్ఆర్‌కు గవర్నర్‌ విశ్వభూషణ్‌ నివాళి

విజ‌య‌వాడ‌:  దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ నివాళులర్పించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆ మహానేత తన జీవితాన్ని ప్రజల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 ఆరోగ్య సేవల నుంచి ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందాయని గవర్నర్‌ ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top