విమానాశ్రయానికి దగ్గరలో హజ్ హౌస్ 

 డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా 
 

విజయవాడ: ముస్లిం మైనార్టీలు ఎవ్వరూ విజయవాడలోని విద్యాధరపురంలో హజ్ హౌస్ ఏర్పాటుకు ఇష్టపడని కారణంగా విమానాశ్రయానికి దగ్గరలో హజ్ హౌస్ నిర్మించే ప్రయత్నం చేస్తామని డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా హామీ ఇచ్చారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం సెమినార్ హల్లో జరిగిన హజ్ యాత్రికుల ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో కార్య‌క్ర‌మానికి డిప్యూటీ సీఎం, మైనారిటీ శాఖ మంత్రి అంజాద్ బాషా,   తెలంగాణ రాష్ట్ర హజ్ కమీటీ చైర్మన్ మసి ఉల్లా ఖాన్, ఎమ్మెల్యే ముస్తఫా, వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  రెహ్మాన్ హాజరయ్యారు.

రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి  అంజాద్ బాషా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరమైన హజ్ యాత్ర చేసేవిధంగా యాత్రికులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ముందుగానే పోర్టల్ లో నమోదు చేసుకోవాలనీ, హజ్ యాత్రకు వెళ్లేవారికి సౌకర్యాల కల్పనపై అవగాహన కార్యక్రమాన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలంటే పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్రం హజ్‌ యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం హజ్‌ యాత్రికులకు అన్ని వసతులు, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. భవిష్యత్తులో హాజీలకు వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. 
అదేవిధంగా, అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.  

Back to Top