మాస్కులు పరిశీలించిన సీఎం జగన్‌

 

 తాడేపల్లి: మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పరిశీలించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఆయనకు మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌ మాస్కులను అందచేశారు.. ఈ కార్యక్రమంలో సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, మెప్మా  అడిషనల్‌ డైరెక్టర్‌ శివపార్వతి పాల్గొన్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.  ప్రజలకు పంపిణీ చేసే 16 కోట్ల మాస్కులను మెప్మా ఆధ్వరంలో డ్వాక్రా మహిళలే తయారు చేశారు. సుమారు 5.3 కోట్ల మందికి ఒక్కొక్కరికీ మూడు చొప్పున 16 కోట్ల మాస్కులు  అందచేయనున్నారు. 

తాజా వీడియోలు

Back to Top