ఆగస్టు 1న జెరూసలేంకు సీఎం వైయ‌స్‌ జగన్ 

రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్‌) విభాగం ఉత్తర్వులు జారీ

అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ ఇజ్రాయెల్‌లోని జరూసలేం పర్యటనకు వెళుతున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పర్యటనలో పాల్గొంటారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్‌) విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటన అని, అందుకు అయ్యే వ్యయం కూడా ఆయనే భరిస్తారని జీవోలో పేర్కొన్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇదివరకే కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చింది.

తాజా ఫోటోలు

Back to Top