రేపు జ‌గ‌న‌న్న చేదోడు

 పల్నాడు జిల్లాలో ల‌బ్ధిదారుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ చేయ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(సోమవారం) పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
 సోమవారం ఉదయం 10 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. 11.05 నుంచి 12.20 వరకు  వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top