17న సీఎం వైయ‌స్‌ జగన్ క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న  

గుమ్మటం తండాలో ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన 

కర్నూలు  : సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17న జిల్లాకు రానున్నారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనే లక్ష్యంగా గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Back to Top