ముఖ్యమంత్రికైనా..సామాన్యుడికైనా ఒకటే రూల్‌

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

రూల్స్‌ పాటించకపోవడమేనా చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం

అమరావతి: ముఖ్యమంత్రికైనా..సామాన్యుడికైనా ఒకటే రూల్‌ ఉండాలని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఇంటి నిర్మాణం 19.50 మీటర్ల ఎత్తులో ఉందని చెప్పారు. గతంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రే వరద ప్రవహాన్ని అడ్డుకునేలా కట్టడాలు చేపట్టడం సరైంది కాదన్నారు. వరద నీటిని అడ్డుకునేలా ప్రజావేదికను నిర్మించారన్నారు. నదీ పరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గురువారం అసెంబ్లీలో నిర్వహించిన జీరో అవర్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతపై టీడీపీ సభ్యులు డిమాండు చేయడంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ కట్టడాలను తొలగిస్తే ఎవరైనా చర్చిస్తారా అని ప్రశ్నించారు. కరకట్టపై అక్రమ కట్టడాలపై తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. రివర్‌ కన్జర్వేటర్‌ ఆదేశాలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రవాహాన్ని అడ్డుకుంటే విజయవాడ కూడా మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. అందరికి ఒకే రూల్‌ ఉండాలని సూచించారు. చంద్రబాబు రూల్స్‌ పాటించకపోవడంతోనే అక్రమ కట్టడాలు వెలిశాయని విమర్శించారు. రూల్స్‌ పాటించకపోవడమేనా చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం సామాన్యుడు కడితే వెంటనే కూల్చేస్తారు..ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం అని సీఎం ప్రశ్నించారు. అక్రమ కట్టడాల తొలగింపు ప్రజావేదిక నుంచే ప్రారంభించామని తెలిపారు. ఇదొక స్ఫూర్తిగా తీసుకోవాలని, అక్రమ కట్టడాలను తొలగించాలని సీఎం సూచించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top