అమరావతి: కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను సీఎం వైయస్ జగన్ సహా కేబినెట్ మంత్రులు అభినందించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం మంత్రి వర్గసమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో 36 అంశాలపై చర్చించారు. వైయస్సార్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపింది. రాజీనామా చేసిన మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు రాజీనామా చేశారు. ఏప్రిల్ 11న మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా రాజీనామా లేఖలను సీఎం వైయస్ జగన్‌కు అందజేశారు.