ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలి

కేంద్రమంత్రులకు సీఎం వైయ‌స్ జగన్‌ లేఖలు
 

తాడేప‌ల్లి:  వంటనూనెలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని సీఎం వైయ‌స్‌ జగన్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్‌ గోయల్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖలు రాశారు.

ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు.. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు సీఎం వైయ‌స్ జగన్‌. రష్యా-ఉక్రెయిన్‌ పరిస్థితుల దృష్ట్యా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌కు కొరత ఏర్పడిందన్న సీఎం వైయ‌స్‌ జగన్‌.. ఈనేపథ్యంలో ఆవనూనె దిగుమతులపై దిగుమతి సంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

సుమారు 92 శాతం సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని లేఖలో సీఎం వైయ‌స్ జగన్‌ గుర్తు చేశారు. అయితే తాజా పరిస్థితుల వల్ల ఒక్కసారిగా ప్రపంచంలో ఈ వంటనూనెలకు కొరత ఏర్పడిందని.. ఈ ప్రభావం వినియోగదారులపై పడిందని సీఎం వైయ‌స్ జగన్‌ లేఖలో ప్రస్తావించారు.

Back to Top