సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో ప్రారంభమైన కేబినెట్ సమావేశానికి మంత్రిమండలి సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీలో ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా రైతు భరోసా పథకం, ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్జ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణకు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని, 6 జిల్లాల్లో వాటర్ షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.