పేదలకు ఇళ్లు.. మరో రూ.5,600 కోట్లు కేటాయింపు..

 అమరావతి: పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్దిదారులందరికీ అందించడానికి సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 18.63 లక్షల ఇళ్లకు గాను, మొదటి దశలో 16.91 లక్షల ఇళ నిర్మాణం ప్రారంభంకాగా, వీటిలో 4.4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశలలో ఉంది.

వైయస్ఆర్‌ జగనన్న కాలనీలను నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు, మురుగు కాల్వల ఏర్పాటు వంటి అన్ని మౌలిక సదుపాయాలతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. భారాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ, ఇ-ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా టెండర్లను ఖరారు చేసిన మార్కెట్ ధర కంటే ధరకు 20 మెట్రిక్ టన్నుల ఇసుక, 5 మెట్రిక్ టన్నుల సిమెంట్, స్టీల్, 12 ఇతర నాణ్యమైన భవన నిర్మాణ సామగ్రిని ఉచితంగా అందిస్తోంది. 

► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 5,600 కోట్ల రూపాయలను కేటాయించింది.

Back to Top