విజయవాడ: బీసీల కోసం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ బీసీ సంఘం మద్దతుగా ఉంటుందని వెల్లడించారు. వైయస్ఆర్‌సీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ నాయకుడు మాత్రమే కాదని.. సంఘ సంస్కర్త అని కొనియాడారు. సీఎం వైయస్ జగన్ ప్రజల జీవితాలను బాగుచేస్తున్నారన్నారు. ఆయన పాలనలో బీసీల పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని తెలిపారు. విజయవాడలో బీసీ సంఘం సమావేశంలో కృష్ణయ్య ప్రసంగించారు. 45 సంవత్సరాలుగా బీసీల కోసం లోక్ సభ, రాజ్యసభలలో పోరాటం ఫలితం ఈ రోజు దొరికిందని ఆయన పేర్కొన్నారు. బీసీ యువకులు అధికార, సంపదకు తావు లేకుండా బీసీల జాతి అభివృద్ధికి పనిచేయటం ఆనందంగా ఉందన్నారు. గత పాలకులు ఓట్ల సమయంలో డబ్బులు, మద్యం, తినడానికి రేషన్ ఇచ్చి చేతులు దులుపుకునే వారని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్లు పాలించి బీసీలకు చేసిందేం లేదని మండిపడ్డారు. బీసీల పిల్లలు ఫీజులు కట్టడానికి రక్తం అమ్ముకున్నారు. సీఎం వైయస్ జగన్ అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి అనేక పధకాలు పెట్టి బీసీల బిడ్డలను చదివిస్తున్నారు. వైయస్ జగన్ పాలనలో మా బతుకులు మారాయి. ఖబడ్డార్ ప్రతిపక్ష పార్టీలు. మీ మోసాలు మాకు తెలిశాయి. ఇన్నేళ్లు మమ్మల్ని మోసం చేశారు. డబ్బు, నోరు, శక్తి, పేరు లేనినవాళ్ళకి పదవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి సీఎం వైయస్ జగన్ అన్నారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి గురించి 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని బీసీ సంఘానికి కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో బీసీల పరిస్థితి బాలేదు. ఇంకా అక్కడ హాస్టళ్లు, గురుకులాలు, తిండి కోసం కొట్లాడుతున్నారు. ఇక్కడి బీసీలు విమానాలు ఎక్కుతున్నారు.. కార్లలో తిరుగుతున్నారు. బీసీలకు అధికారం, సంపద, విద్య, హోదా ఇస్తున్నారు. ప్రతిపక్షాల మోసపు మాటలు నమ్మవద్దు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు.. బీసీల గెలుపు అని ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీల బలమైన గొంతుక సీఎం వైయస్ జగన్: మారేష్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల బలమైన గొంతుక అని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్ తెలిపారు. నవరత్నాల ద్వారా బీసీలకు జరిగిన మేలును 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. 139 బీసీ కులాలు సీఎం జగన్ వెంట నడుస్తాయని అన్నారు. చంద్రబాబు బీసీ నేత అచ్చెన్నాయుడిని పక్కకుపెట్టి పవన్ కల్యాణ్‌ను అక్కున చేర్చుకున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. 6 కి.మీ లు వెళ్లి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి కావాలా? ఉదయం 6 గంటలకు పెన్షన్ ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే పరిస్థితి కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు.