వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు

పొట్టి శ్రీ‌రాములుకు ఘ‌న నివాళి

పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగానికి సీఎం, డిప్యూటీ సీఎం తూట్లు 
 

ప్రాణత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములు 
 

అయినా ఆయనకు నివాళులర్పించకపోవడం దారుణం
 

రాష్ట్రావతరణ దినోత్సవం జరపకపోవడం అమరజీవికి అవమానం
 

ఇది ఆయననే కాదు.. ఆర్యవైశ్యులనూ అవమానపర్చడమే
 

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పష్టీకరణ

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. పొట్టి శ్రీ‌రాములు చిత్ర‌ప‌టానికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు, టీజేఆర్ సుధాక‌ర్‌బాబు, త‌దిత‌రులు పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి పొట్టి శ్రీ‌రాములు చేసిన త్యాగాన్ని స్మ‌రించారు. 

తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ, ఆమరణ నిరాహార దీక్షతో ప్రాణ త్యాగం చేసి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌ను సాధించిన పొట్టి శ్రీరాములను అవమానించేలా, కించ పర్చేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కూటమి ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆక్షేపించారు. అమరజీవి ఆత్మ బలిదానంతో నాడు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నవంబరు 1న రాష్ట్రావతరణ దినోత్సవం నిర్వహించని గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన జూన్‌ 2న, నవనిర్మాణ దీక్ష పేరుతో నాటకమాడిందని వారు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా నవంబరు 1న రాష్ట్రావతరణ దినోత్సవం నిర్వహించడం లేదని దుయ్యబట్టారు.
    రాష్ట్రావతరణ దినోత్సవం నిర్వహించకపోవడం కేవలం అమరజీవి పొట్టి శ్రీరాములును మాత్రమే కాకుండా, ఆర్యవైశ్య జాతినే అవమానించడమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.
చేసిన తప్పిదానికి సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ లెంపలేసుకుని, వెంటనే ఆర్యవైశ్యులకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు.
    రాష్ట్ర విభజనతో 2014 జూన్‌ 2న, ప్రత్యేక తెలంగాణ ఏర్పడగా, ఏటా ఆ రోజున నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రూ.80 కోట్లు ఖర్చు చేసిందని వెల్లంపల్లి శ్రీనివాస్‌ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరించిన నవంబరు 1వ తేదీని, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం విస్మరించిందని, మన రాష్ట్రానికి అవతరణ దినోత్సవం లేకపోవడం సిగ్గుచేటని, బాధాకరమని ఆవేదన చెందారు. ఆర్యవైశ్యులను అవమానించేలా ఉన్న చింతామణి నాటకాన్ని ఆ జాతి ప్రతినిధుల కోరిక గతంలో జగన్‌గారు రద్దు చేస్తే, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారని, అదే జరిగితే ఊర్కునేది లేదని వెల్లంపల్లి హెచ్చరించారు.
    ఇటీవల ప్రకటించిన టీటీడీ బోర్డులోనూ ఆర్యవైశ్యులకు స్థానం కల్పించలేదని వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆక్షేపించారు. ఆ పదవికి అర్హులైన వైశ్యులు టీడీపీ, జనసేనలో ఎందరో ఉన్నా, వారిని కాదని.. తమకు ఆర్థికంగా పనికొచ్చిన వారికి, పనికి మాలిన వారికి బోర్డులో స్థానం కల్పించారని వెల్లంపల్లి దుయ్యబట్టారు.
    చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్ర విభజనకు కారకుడయ్యాడని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం కూడా జరపకుండా, అమరజీవి ఆత్మ త్యాగానికి ఆయన తూట్లు పొడిచాడని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆక్షేపించారు. 
    అలాగే టీటీడీ బోర్డులో ఆర్యవైశ్యులతో పాటు, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఎందుకు ప్రాతినిథ్యం కల్పించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ట్రస్ట్‌ బోర్డుల్లో బ్రాహ్మణులకు స్థానం కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అదే విధంగా, ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కూడా దానిపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు క్యాబినెట్‌ బ్రీఫింగ్‌లో చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. చంద్రబాబు, ఇప్పుడు ఆ మాట కూడా తప్పారని ఆక్షేపించారు. జగన్‌గారిని వ్యతిరేకించేవారికి మాత్రం అన్నింట్లో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని దుయ్యబట్టారు.
    చంద్రబాబు తన జీవితంలో ఏనాడూ బ్రాహ్మణులకు ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వలేదని, వారికి పదవులు కూడా ఇవ్వలేదన్న మల్లాది, ఇప్పుడు వేద పండితులకు ఆర్థిక సాయం ప్రకటించి సంభావన పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నిజానికి వేద పండితులు, బ్రాహ్మణులను గుర్తించిన జగన్‌గారి ప్రభుత్వం, వారికి కోవిడ్‌ సమయంలో రూ.5 వేల ఆర్థిక సాయం చేసిందని మల్లాది విష్ణు గుర్తు చేశారు.

Back to Top