ప్రతి గడపకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే సీఎం సంకల్పం 

ఆముదాలవలస :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీటి కల్పన ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చర్యలు చేపడుతున్నారని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు సంయుక్తoగా రూ. 61.38 కోట్ల అంచనా వ్యయంతో  ఇంటింటికి మంచినీటి కొళాయి పనులు నిర్మాణానికి స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం గావించుకొనున్న పనులు శంకుస్థాపన కార్యక్రమం  పాలపోలమ్మ గుడి వద్ద బుధవారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మానవ జీవితంలో ఆహారంతో పాటు స్వచ్ఛమైన గాలి,స్వచ్ఛమైన నీరు అత్యంత ఆవశ్యకమైనవిగా పేర్కొన్నారు. స్వచ్ఛమైన త్రాగునీరు సేవించుట ద్వారా అనారోగ్యలకు దూరంగా ఉండవచ్ఛన్నారు. కొన్ని ప్రాంతాల్లో కలుషితం అయిన నీరు త్రాగటం ద్వారా వ్యాధులు భారిన పడుతున్నారన్నారు. మరి కొన్ని చోట్ల ఉండే నేలలో లభ్యం అయ్యే నీటిలో లవణ శాతం ఘననీయం గా ఉంటుందన్నారు. ఫ్లోరైడ్ లావణాలు కలిసి ఉన్న నీటిని తాగేవారు ఫ్లోరోసిస్ వ్యాధులు భారిన పడుతున్నారని తెలిపారు. గతంలో కొన్ని చోట్ల ఉండే నేలల్లో  మాత్రమే ఫ్లోరైడ్ లవణాలు ఉన్న నీరు లభ్యం కాగా,, ప్రస్తుతం పలు చోట్ల లవణాలుతో కలిసి ఉన్న నీరు లభించే పరిస్థితి లు ఏర్పడ్డయాన్నారు.ఇట్లాంటి తరుణంలో రాష్ట్రo లో పలు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో  భూ అంతర్భాగం నుండి గానీ, సమీప ప్రవాహ నదుల్లో నుండి గానీ నీటిని సంగ్రహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.సంగ్రహించిన నీటిలో అనారోగ్యo కలిగించే లవణాలను, కారకాలను ప్రత్యేక పద్ధతుల్లో  తొలిగించడం జరుగుతుందన్నారు. శుద్ధి చేసిన నీటిని కొళాయిలు ద్వారా ఇంటింటికి త్రాగునీరు కోసం అందించడమే పధకం యొక్క అంతిమ ఉద్దేశ్యం అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో జల జీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి కల్పనకు చిత్తశుద్ధి తో వ్యవహారిస్తుందన్నారు.ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో నాలుగు ట్యాంక్ లు నిర్మాణం జరిపి,వీటి ద్వారా నీటిని సంగ్రహించి,శుద్ధి చేయబడిన జలాన్ని ప్రజానీకానికి అందివ్వటం జరుగుతుందన్నారు.పనులు వేగం గా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.మునిపాలిటీ పరిధిలో పూర్తి స్థాయి మౌళిక వసతుల కల్పనకు చిత్తశుద్ధి తో కృషి చేస్తానని అన్నారు.నియోజకవర్గం అన్ని రంగాల్లో ప్రగతి బాట పట్టడమే తన ఉద్దేశ్యం అన్నారు.నియోజకవర్గం అభివృద్ధి లో బాసటగా నిలిచే విధంగా ,వనరులు సృష్టిoచేలా చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కి స్పీకర్ ప్రత్యేక ధన్యవాదములు  తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బోడ్డేపల్లి రమేష్ కుమార్, వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, సాహిత్య అకాడమీ డైరెక్టర్ జె జె మోహన్ రావు, డి సి సి బి డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోర చిన్నమనాయుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుసుమంచి శ్యాం ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు నాయకులు దుంపల శ్యామలరావు, జెకె వెంకు బాబు, పొన్నాడ చిన్నారావు, శిల్ల మళ్లీ,సాదు కామేశ్వరరావు, మామిడి ప్రభాకర్ రావు, ఎండ విశ్వనాథం, పొన్నాడ కృష్ణారావు, మూడడ్ల రమణ, సాధు చిరంజీవి, చిన్నారావ్, కూన రామకృష్ణ, తాహసిల్దార్ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, ఇరిగేషన్ ఎస్సీ, డి ఈ లు  మరియు వైయస్ఆర్‌సీపీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Back to Top