సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. కేబినెట్ భేటీ అనంతరం సాయంత్రం సీఎం వైయస్ జగన్.. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. కేబినెట్ భేటీలో ముఖ్యంగా చర్చించే అంశాలు.. ►దేవాదాయ శాఖ చట్ట సవరణలపై చర్చించే అవకాశం ►రాష్ట్రంలో గుట్కా నిషేదానికి చట్ట సవరణపై చర్చించే అవకాశం ►ఫిలిమ్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయ ప్రతిపాదనపై చర్చించే అవకాశం ►అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు పై చర్చించే అవకాశం ►అమ్మ ఒడి పథకం అమలు పై చర్చించే అవకాశం ►రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.