జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు దుర్మార్గం 

హరికృష్ణ సతీమణిని అవమానిస్తే  సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు 

అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ  అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సూటి ప్ర‌శ్న‌

అనంతపురం:  సినీ న‌టుడు జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం దుర్మార్గ‌మ‌ని అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ  అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిప‌డ్డారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను చంద్ర‌బాబు మందలించి వదిలేయటం బాధాక‌ర‌మ‌న్నారు. హరికృష్ణ సతీమణిని అవమానిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేద‌ని సూటిగా ప్ర‌శ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నార‌ని నిల‌దీశారు. సోషల్ మీడియా అనుచిత పోస్టింగ్స్ పై కేసులు పెట్టే ప్రభుత్వం... ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై ఎందుకు చర్యలు తీసుకోలేద‌ని మండిప‌డ్డారు. ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం మంత్రి నారా లోకేష్ కు కోట్ల రూపాయలు ఇచ్చాం... ఇప్పుడు సంపాదించుకోవడం మా హక్కు అని టీడీపీ ఎమ్మెల్యేలు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నార‌ని అనంత వెంకటరామిరెడ్డి గుర్తు చేశారు.

Back to Top