ఆ ఘనత సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుంది

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా
 

విశాఖపట్నం : ఏపీ చరిత్రలో మొదటిసారి ఓ మైనార్టీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా వెల్లడించారు. విశాఖలో ఆదివారం జరిగిన మైనారిటీ సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో ముస్లింలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. కేవలం ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ముస్లింలు గుర్తుకు వస్తారని ఆరోపించారు. ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్‌ కల్పించి వైయస్‌ఆర్‌ మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. వైయస్‌ఆర్‌ సాధికారత కింద పేద ముస్లింలకు హజ్‌ యాత్ర కింద ప్రత్యేక నిధులు కేటాయించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణకు నిధులు కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top