అరే సాంబా రాస్కో...  ఓడినోళ్లే బోడిలింగాలు ..!

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

గుంటూరు: జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో చేసిన తీవ్ర వ్యాఖ్యల‌ను వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఖండించారు. పవన్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోని పాప్యులర్ డైలాగ్ ను ఉపయోగిస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు. "అరే సాంబా రాస్కో.... గెలిచినోళ్లు కాదు... ఓడినోళ్లే బోడిలింగాలు!" అంటూ అంబ‌టి రాంబాబు పవన్ కు బదులిచ్చారు. రైతులకు పరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ చేసిన హెచ్చరికలపైనా అంబటి స్పందించారు. అసెంబ్లీ ముట్టడికి ఇదేమైనా సినిమా షూటింగా? అని వ్యాఖ్యానించారు. వకీల్ సాబ్ కాదు నకిలీ సాబ్ అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. 
 

Back to Top