అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే బాబుకు వచ్చే నష్టమేంటి?   

ఎమ్మెల్యే అంబటి రాంబాబు 
 

గుంటూరు : అభివృద్ధి వికేంద్రీకరణకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఆయన ట్రాప్‌లో రైతులు ఎవరు పడొద్దని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రజలకు హితబోద చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే బాబుకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు రాకూడదనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చారని పేర్కొన్నారు.అమరావతిలో భూములు కొన్నవారే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే బాబుకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు కేవలం తన ఆస్తులు పోతాయన్న భయంతోనే ఉద్యమం చేపట్టారని విమర్శించారు. అందుకోసమే బాబు జోలే పట్టుకొని నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దయచేసి రైతులెవరు ఆయన ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్‌ నాయకత్వంలో నిజమైన రైతులకు ఎప్పటికి అన్యాయం జరగదని, నిజంగానే రైతుకు నష్టం జరిగితే వారి సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అంబటి వెల్లడించారు. 
 

తాజా వీడియోలు

Back to Top