రాజధాని రైతులు, కూలీల రౌండ్‌టేబుల్‌ సమావేశం

హాజరైన మంత్రి బుగ్గన, ఎమ్మెల్యేలు జోగి రమేష్, శ్రీదేవి

గుంటూరు: రాజధాని రైతులు, కూలీల రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హాజరయ్యారు. ‘చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం’ పేరుతో తుళ్లూరులో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, ఉండవల్లి శ్రీదేవి, వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని రౌండ్‌ టేబుల్‌ దృష్టికి తీసుకువచ్చారు. రాజధాని పేరుతో చంద్రబాబు తమను అన్యాయం చేశారని, దళితుల భూములకు తక్కువ ప్యాకేజీ ఇచ్చి మోసం చేశారన్నారు. తమకు క్షమాపణ చెప్పాలని చంద్రబాబు పర్యటనలో నిరసన చేపట్టామన్నారు. 
 

Read Also: రాజధాని గురించి చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం

తాజా ఫోటోలు

Back to Top