తాడేపల్లి : 2025 ఎఫ్‌ఐడీఈ మహిళల చెస్ ప్రపంచ కప్ భారత్ గెలుచుకోవటంపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్‌లో తలపడిన ఇద్దరు భారతీయ మహిళలు కోనేరు హంపి, దివ్యదేశ్‌ముఖ్‌లకు అభినందనలు తెలిపారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న నాలుగవ మహిళా గ్రాండ్ మాస్టర్ దివ్య చరిత్ర సృష్టించిందంటూ ఎక్స్ వేదికగా కొనియాడారు.