విజయవాడ: రూ.11 కోట్ల విషయంలో సిట్ కుట్రలు చేస్తోందని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీరియల్ నంబర్స్ వీడియోగ్రఫి చేయాలని కోర్టు ఆదేశించినా కానీ.. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారంటూ ఆయన ప్రశ్నించారు. నోట్లు వెరిఫై చేస్తే ఎవరు విత్ డ్రా చేశారో తెలుస్తుందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్లు రూపాయలు సీరియల్ నెంబర్లు వీడియో గ్రఫి చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. రూ.11 కోట్లు ఎస్‌బీఐ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి సిట్ సన్నాహాలు చేస్తుండగా.. రూ. 11 కోట్లను కచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియో గ్రఫి చేయాలని పిటిషన్‌లో పేర్కొన్న న్యాయవాది.. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతుందన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పత్రికా ప్రకటన “లేని లిక్కర్ కేసును సృష్టించి, వైయస్ఆర్‌సీపీపై బురదజల్లేందుకు, ఇబ్బందిపెట్టేందుకు యత్నిస్తున్న చంద్రబాబు సిట్ మళ్లీ అడ్డంగా దొరికిపోయింది మద్యం కరెన్సీ నోట్ల మధ్య చెవిరెడ్డి అనుచరుడు అంటూ నిర్ధారణలేని వీడియోను సర్క్యులేషన్‌లో పెట్టారు. లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బును చెవిరెడ్డిద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికలు మేలో 2024లో జరిగితే, 2023 మే నాటికే రూ.2వేల నోట్లు రద్దయ్యాయి. ఇప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా రూ.2 వేల నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. అంటే చెవిరెడ్డి ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు పంచారన్నది ఒక అబద్ధమని ఒప్పుకున్నట్టేగా? ఇప్పుడు ఇలాంటి ఈ వీడియోను లిక్కర్ అక్రమకేసుకు లింకుపెట్టే ప్రయత్నంచేస్తున్నారు. ఏమాత్రం పరిశీలన చేసివారు ఎవరైనా, చంద్రబాబు సిట్ కుట్రను ఇట్టే గుర్తిస్తారు. లిక్కర్ అక్రమ కేసులో ఇప్పటివరకూ ఆధారాల్లేకే చంద్రబాబు సిట్ పిల్లిమొగ్గలు రూ.11 కోట్ల నగదు పట్టివేతలో ఇవాళ ఏసీబీ కోర్టు ఉత్తర్వులతో చంద్రబాబు సిట్ బెంబేలెత్తింది. ఆ నోట్ల సంగతి తేల్చేందుకు సీరియల్ నంబర్లు నమోదు, ఫొటోగ్రఫీ చేయాలన్న కోర్టు ఆదేశాలను చంద్రబాబు సిట్ పట్టించుకోలేదు. ఆ ఆదేశాలను పట్టించుకోకుండా హడావిడిగా బ్యాంకులో డిపాజిట్ చేశారు, ఇతర నోట్లతో కలిపేసే ప్రయత్నంచేశారు దీంతో నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. జప్తుచేసిన ఆనోట్లను విడిగా పెట్టాలని ఇవాళ కోర్టు స్పష్టంగా దేశాలు ఇచ్చింది కోర్టు ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తే ఆనోట్లు ఎప్పుడు విడుదలయ్యాయి, ఎక్కడ నుంచి వస్తాయో ఇట్టే తెలిసిపోతుంది చంద్రబాబు సిట్ కుట్ర బద్దలయ్యేందుకు ఇవి సాక్ష్యాలుగా ఉంటాయి అందుకే… సిట్ హడావిడిగా రూ.11 కోట్ల నగదును డిపాజిట్‌చేసి, ఆధారాలు చెరిపివేసే ప్రయత్నంచేసింది కోర్టులో విచారణ సందర్బంగా చంద్రబాబు సిట్ కుట్రలు బయటపడ్డాయి. అందుకే ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు చెవిరెడ్డి అనుచరుడు అంటూ ఈ వీడియోను బయటపెట్టారు నిర్ధారణలేని ఆ తప్పుడు వీడియోను పట్టుకుని ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది. అందులో రూ.2వేల నోట్లు ఉన్నాయంటే.. ఈ వీడియోకు, చంద్రబాబుగారు సృష్టించి నడిపిస్తున్న లిక్కర్ అక్రమ కేసుకు సంబంధం లేదని తేలిపోయింది వైయస్సార్‌సీపీపై విషప్రచారం చేసి, అక్రమ అరెస్టులు చేసి రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు దీనికోసం తప్పుమీద తప్పు చేసుకుంటూ వెళ్తున్నారు ఒక తప్పును మూసేయడానికి మరో తప్పుడు చేస్తున్నారు ప్రజలు అన్ని విషయాలనూ గమనిస్తున్నారు.’’