బొల్లాపల్లిలో `బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ`

రీకాలింగ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో..పోస్ట‌ర్‌ ఆవిష్క‌రించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు

ప‌ల్నాడు: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు శ‌నివారం బొల్లాప‌ల్లి మండలంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, పార్టీ సమన్వయకర్త బొల్లా  బ్ర‌హ్మ‌నాయుడు కార్య‌క్ర‌మంలో పాల్గొని రీకాలింగ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు.  క్యూ ఆర్ కోడ్ ను స్కాన్  చేయించి చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వీడియో రూపంలో వివరించారు. అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబు అనేక హామీలు ఇచ్చి..తీరా అధికారంలోకి వ‌చ్చాక మోసం చేశార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ మోసాల‌ను ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో గడప గడప తిరిగి ప్రజలకు వివరించాలని, అలానే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాల‌ను గుర్తు చేయాల‌ని దిశానిర్దేశం చేశారు.  గతంలో పచ్చగా కనిపించే పల్లెలు, నేడు మద్యం ప్రవాహాలలో కొట్టుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బొల్లాపల్లి మండల వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ   ముఖ్యనేతలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

Back to Top