వరికూటి అశోక్‌బాబుకు వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌

ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న పార్టీ అధినేత‌

పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో సాగునీటి కాలువలు గుర్రపు డెక్కతో నిండిపోయి పంటపొలాలకు నీరు రావడం లేదంటూ రైతుల కష్టాలపై రేపల్లెలో నిరసన తెలుపుతున్న వైయ‌స్ఆర్‌సీపీ  వేమూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌ వరికూటి అశోక్‌బాబుపై పోలీసుల దాడిని వైయస్‌ జగన్‌ తీవ్రంగా ఖండించారు. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైయస్‌ జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. వేలాదిమంది రైతుల తరుపున పోరాడుతూ, వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్‌బాబు చేస్తున్న ప్రయత్నాన్ని అణిచివేయాలని చూడడం దారుణమన్నారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం చేయడం అభినందనీయమని అశోక్‌బాబును ప్రసంసించారు. తనపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించిన తీరును అశోక్‌బాబు వైయస్‌ జగన్‌కు వివరించారు. అశోక్‌బాబు ఆరోగ్య వివరాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులకు అండగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఉంటుందని, అశోక్‌బాబుకు అవసరమైన పూర్తి సహాయసహకారాలు పార్టీ నుంచి అందుతాయని వైయస్‌ జగన్‌ భరోసానిచ్చారు.

Back to Top