సీఎం మనసు, పాలన బావున్నాయి కాబట్టి రాష్ట్రంలో సుభిక్షం

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

వైయ‌స్ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు

తాడేప‌ల్లి: పాలకుడు మంచివాడయితే ప్రకృతి కరుణిస్తుందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మనసు, పాలన బావున్నాయి కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది, రైతులు సంతోషంగా ఉన్నార‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పంపిణీ కార్య‌క్ర‌మం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి జరిగిన సమావేశంలో మంత్రి, వ‌ర్చువ‌ల్‌గా రైతులు మాట్లాడారు.

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఏమన్నారంటే... 

అందరికీ నమస్కారం, ఈ రోజు వైయ‌స్ఆర్‌ రైతు భరోసా, వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ. 1,294 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న నేపధ్యం, రైతు భరోసాకు సంబంధించి సీఎంగారు ఇచ్చిన హామీ రూ. 50 వేలు ఇస్తామన్న హామీకి  అదనంగా, చెప్పిన దానికన్నా ఎక్కువగా రూ. 17,500, మొత్తం రూ. 67,500 ఇచ్చిన పరిస్ధితి, గతంలో అనేక హామీలిచ్చి రైతులను మోసం చేస్తే ఇప్పుడు మాత్రం చెప్పినదానికన్నా మిన్నగా ఇచ్చిన ఘనత ఈ సీఎంగారిది, మనం గర్వంగా మాట్లాడుకోవాల్సిన పరిస్ధితి, రైతులకు అనేక రకాలుగా మోసం చేసింది గత ప్రభుత్వం, రుణ ఉపశమన పత్రం వంటి పత్రాలు కూడా ఇచ్చి మోసం చేశారు, కానీ సీఎంగారు రైతుల పక్షాన నిలబడ్డారు, ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా సంస్కరణలు తీసుకొచ్చారు, ఆర్బీకేలలో కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి, విత్తనం నుంచి విక్రయం వరకు అన్నీ అందుబాటులోకి వచ్చాయి, మా నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో లేట్‌ ఖరీఫ్, ఎర్లీ రబీ, కోతలు ప్రారంభమయ్యాయి, గతంలో పుట్టి (850 కేజీలు) 18,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ. 12,000 నుంచి 13,000 కానీ ఈ రోజు పుట్టి రూ. 23,500 నుంచి 24,000 (ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్‌పీ కన్నా 30 శాతం అధిక ధరకు) రైతులు అమ్ముకుంటున్నారు. పాలకుడు మంచివాడయితే ప్రకృతి కరుణిస్తుందని సీఎంగారి మనసు, పాలన బావున్నాయి కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది, రైతులు సంతోషంగా ఉన్నారు, చంద్రబాబు కరువు కవల పిల్లలు, దేశం గర్వించే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది, సీఎంగారు రైతులకు ఏ విధంగా సాయం చేయాలని అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు, రైతు బావుంటే రాష్ట్రం బావుటుందని నమ్మి ఆచరిస్తున్న సీఎంగారు, మరో మూడు నెలల్లోపు మళ్ళీ వైయ‌స్ జగన్‌ గారి ఆధ్వర్యంలో రైతు పక్షపాత ప్రభుత్వం ఏర్పడుతుంది, అప్పుడు మరింతగా రైతాంగానికి సేవ చేసే అవకాశం ఉంటుంది, దేశ చరిత్రలో ఏ సీఎం తీసుకోని విధమైన అసాధారణ నిర్ణయాలు రైతుల గురించి ఈ సీఎంగారు తీసుకున్నారు, రైతుల పక్షాన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు, థ్యాంక్యూ. 

ఏ రైతుకు కష్టం వచ్చినా నేనున్నా అని సీఎం ముందుకు వ‌స్తున్నారు: ఎన్‌. బాబు, రైతు, అనంతపురం జిల్లా నుంచి

జగనన్నా నమస్తే, అన్నా మా జిల్లా రైతాంగం తరపున మీకు ధన్యవాదాలు, దేశంలో ఎవరూ చేయని విధంగా ఆర్బీకేలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి విక్రయం వరకు అందిస్తున్నారు. ఈ–క్రాప్‌ వల్ల అన్నీ అందుతున్నాయి, మా గ్రామం చిన్న పల్లె, మాకు 3.38 ఎకరాలు ఉంది, గతంలో బీడుగా ఉండేది, మీరు రాగానే రైతులకు అవసరమైన సాయం చేస్తున్నారు, మీరు 4 ఏళ్ళలో రూ. 50 వేలు ఇస్తామని అదనంగా రూ. 17,500 కలిపి మొత్తం రూ. 67,500 ఇచ్చారు, మేం పంట వేస్తే మీరు బీమా చెల్లిస్తున్నారు, మా రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నారు, ఏ రైతుకు కష్టం వచ్చినా మీరు నేనున్నా అని ముందుకు వస్తున్నారు, నేను సున్నా వడ్డీ కూడా పొందుతున్నాను, మీరు సన్న, చిన్నకారు రైతులకు కూడా వ్యవసాయ పనిముట్లు అందజేసి ఆదుకున్నారు, రైతులకు సలహా మండలి ఏర్పాటు చేసి మాకు చాలా ఉపయోగకరంగా ఉంచారు, గతంలో విత్తనాల కోసం మండల కేంద్రాల్లో పడిగాపులు కాసేవాళ్ళం, కానీ ఇప్పుడు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు ఇస్తున్నారు, గతంలో ఏం ఇస్తే అది తీసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మంచి విత్తనాలు తీసుకుంటున్నాం, గతంలో పాలు కర్ణాటకలో అమ్ముకునేవాళ్ళం కానీ ఇప్పుడు పాల ఉత్పత్తిదారులను మీరు ఆదుకోవడంతో వారు సంతోషంగా ఉన్నారు, రైతులకు మీరు చాలా సాయం చేశారు, నా కుటుంబం మీ ద్వారా చాలా లబ్ధిపొందింది, నా కుటుంబం మీ నుంచి రూ. 3,42,152 లబ్ధి పొందాను, ధన్యవాదాలు, స్కూల్స్‌ చాలా బావున్నాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారు, రైతులను మీరు పూర్తిగా ఆదుకుంటున్నారు, రైతు భారాన్ని మీరు మోస్తున్నారు, చాలా అద్భుతమైన దూరదృష్టిగల సీఎం మీరు, మీరు మళ్ళీ సీఎంకావాలి, మిమ్మల్ని మళ్ళీ సీఎం చేసుకునేందుకు రైతాంగం సిద్దంగా ఉంది, థ్యాంక్యూ.   

మళ్ళీ జ‌గ‌న‌న్న‌ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు:  వై.శ్రీనివాసరావు, రైతు, గజపతినగరం, విజయనగరం జిల్లా

నమస్కారం, నేను 4 ఎకరాల్లో ప్రత్తి, 3 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పండిస్తున్నాను. మీ పాదయాత్రలో మా సమస్యలు చెప్పాను, మా కష్టాలన్నీ చెప్పుకున్నాం, నాడు ధర్నాలు చేస్తే కానీ విత్తనాలు దొరికేవి కాదు, మా సమస్యలు విన్నారు, చూశారు, మీరు మాట ఇచ్చిన ప్రకారం ఒక వ్యవస్ధను తీసుకొచ్చి రైతుల కళ్ళలో ఆనందం చూశారు, రైతులకు మీరు ప్రణాళికాబద్దంగా సాయం చేశారు, మా దిగుబడులు పెరిగాయి, ఈ–క్రాప్‌ ద్వారా పంట రుణాలు ఇవ్వడం, సున్నావడ్డీ చాలా బాగా ఇస్తున్నారు, గతంలో కరువుతో ఇబ్బంది పడేవాళ్ళం, కానీ ఇప్పుడు అలాంటి పరిస్ధితి లేదు, గతంలో ఇన్సూరెన్స్‌ డబ్బు కట్టి చేయించుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు, దేశంలో ఎక్కడా ఈ–క్రాప్‌ విధానం చూడలేదు, మన దగ్గర మాత్రం ఇది చక్కగా అమలవుతుంది, రైతుకు భరోసా, నమ్మకం కల్పించారు, మేం సంతోషంగా ఉన్నాం, మాకు నేరుగా మా ఖాతాల్లో నగదు జమ అవుతుంది, మీరు రైతుపక్షపాతిగా ఉన్నారు, మేం చాలా లబ్ధిపొందాం, నేను 78 బస్తాల ధాన్యం 3 ఎకరాల్లో  పండిస్తే రూ. 1,56,000 నేరుగా నా ఖాతాలో జమ చేశారు, నా పిల్లలకు విద్యాదీవెన అందింది, నా భార్యకు అనారోగ్యం వస్తే నేరుగా వైజాగ్‌ అపోలో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందాం, చికిత్స కింద రూ. 1,48,000 ప్రభుత్వం చెల్లించింది, నా ఫోన్‌కు మెసేజ్‌ కూడా వచ్చింది, పైగా తను కోలుకోవడానికి రూ. 4,750 జమ చేశారు, మీరు పెద్ద మనసుతో చాలా సాయం చేస్తున్నారు, నాడు నేడు ద్వారా స్కూల్స్‌లో చాలా మార్పులు తీసుకొచ్చారు, అమ్మ ఒడి పథకం చాలా బావుంది, చక్కటి పౌష్టికాహారం ఇస్తున్నారు, ఇంగ్లీష్‌ మీడియం చక్కటి కార్యక్రమం, పేదల పిల్లలు కూడా ఇంగ్లీష్‌ నేర్చుకుంటే వారి భవిష్యత్‌ బావుంటుందని ప్రపంచ స్ధాయిలో ఎదగాలనే మీ సంకల్పం గొప్పది, విద్య, వ్యవసాయం, వైద్యంలో మీరు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు, రైతాంగం తరపున మీకు ధన్యవాదాలు, మీరు మళ్ళీ సీఎంకావాలని అందరూ కోరుకుంటున్నారు.

Back to Top