టిటిడి ఉద్యోగుల‌పై న‌టి అర్చ‌నా గౌత‌మ్ దాడి హేయ‌మైన చ‌ర్య

అవాస్త‌వ ఆరోప‌ణ‌ల‌తో ఉద్యోగుల‌పైనే త‌ప్పుడు ఫిర్యాదు

 టిటిడి ఖండ‌న‌

తిరుమ‌ల‌:  టిటిడి ఉద్యోగుల‌పై న‌టి అర్చ‌నా గౌత‌మ్ దాడి హేయ‌మైన చ‌ర్య అని టిటిడి ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అవాస్త‌వ ఆరోప‌ణ‌ల‌తో ఉద్యోగుల‌పైనే త‌ప్పుడు ఫిర్యాదు చేశార‌ని, ఆమె చ‌ర్య‌ల‌ను  టిటిడి ఖండించింది. 

ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన  శివ‌కాంత్ తివారి, న‌టి అర్చ‌నా గౌత‌మ్‌తోపాటు మ‌రో ఏడుగురికి ఆగ‌స్టు 31న శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం కేంద్ర స‌హాయమంత్రి నుంచి సిఫార‌సు లేఖ‌ను తీసుకుని తిరుమ‌ల‌కు వ‌చ్చారు. అద‌న‌పు ఈవో కార్యాల‌యంలో ద‌ర్శ‌నం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ లేఖపై రూ.300/- ద‌ర్శ‌నం టికెట్లు మంజూరు చేస్తూ  శివ‌కాంత్ తివారీకి చెందిన 9454607006 మొబైల్ నంబ‌రుకు మెసేజ్ పంపారు. అయితే వారు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోలేదు. అటు త‌రువాత శ్రీ శివ‌కాంత్ తివారి అద‌న‌పు ఈవో కార్యాల‌యానికి వెళ్లారు. అప్ప‌టికే టికెట్లు తీసుకోవాల్సిన గ‌డువు ముగిసిందని వారు తెలిపారు .

             శివ‌కాంత్ తివారితోపాటు అద‌న‌పు ఈవో కార్యాల‌యంలోకి చొచ్చుకుని వ‌చ్చిన న‌టి అర్చ‌నా గౌత‌మ్ ఆగ్ర‌హంతో విచ‌క్ష‌ణ కోల్పోయి కార్యాల‌య సిబ్బందిని దుర్భాష‌లాడారు. స‌ర్ది చెప్ప‌బోయిన ఒక ఉద్యోగిపై చేయి చేసుకున్నారు.  తివారి  ఆమె చేస్తున్న యాగీని చూస్తూ ఉరుకున్నారు త‌ప్ప ఆమెను వారించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. చివ‌ర‌కు ఆద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బంది వారి వివ‌రాలు తీసుకుని రెండోసారి రూ.300/- టికెట్లు కేటాయించినా తీసుకోవ‌డానికి న‌టి అర్చ‌నా గౌత‌మ్ నిరాక‌రించారు. అనంత‌రం అక్క‌డినుండి టు టౌన్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి కార్యాల‌య సిబ్బంది త‌న‌పై చేయి చేసుకుని దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని త‌ప్పుడు ఫిర్యాదు చేశారు. అద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బందిని అక్క‌డి సిఐ పిలిపించి విచార‌ణ చేప‌ట్టారు. సిబ్బంది తాము తీసిన వీడియోను సిఐకి చూప‌గా న‌టి దురుసుగా ప్ర‌వ‌ర్తించిన విషయం వెలుగుచూసింది. దీంతో న‌టి వెన‌క్కి త‌గ్గి అక్క‌డినుంచి వెళ్లిపోయారు.

               సెప్టెంబరు  1వ తేదీకి విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ కావాలంటే రూ.10,500/- చెల్లించి శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ పొందొచ్చ‌ని మాత్ర‌మే సిబ్బంది స‌ల‌హా ఇచ్చారు. వాస్త‌వాలు ఇలా ఉండ‌గా అద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బంది ద‌ర్శ‌నం టికెట్ కోసం రూ.10 వేలు డిమాండ్ చేశార‌ని స‌ద‌రు వీడియోలో న‌టి ఆరోపించారు. తాను సెల‌బ్రిటీ అయినందువ‌ల్ల ఏమి చెప్పినా భ‌క్తులు న‌మ్ముతార‌నే అభిప్రాయంతో న‌టి అర్చ‌నా గౌత‌మ్ అవాస్త‌వాల‌తో సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేశారు. భ‌క్తులు ఇలాంటి అవాస్త‌వ ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

తాజా వీడియోలు

Back to Top