ప్ర‌జ‌లు మళ్లీ సీఎం వైయ‌స్ జగన్‌కు పట్టం కట్టడం ఖాయం

ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు..  
 

విజ‌య‌వాడ‌:  2024లో ప్రజలు మళ్లీ సీఎం వైయ‌స్ జగన్‌కు పట్టం కట్టడం ఖాయ‌మ‌ని ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు  అలీ దీమా వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఓ మనసున్న నాయకుడు...ప్రజలకు ఏం కావాలో అన్నీ చేస్తున్నార‌ని తెలిపారు.  ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా అలీ బాధ్యతలు స్వీకరించారు. ఈ  సందర్భంగా ఆయన   మీడియాతో మాట్లాడుతూ.. తనపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ సీఎం వైయ‌స్ జగన్‌ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్లా జరిగేదే.. అందరం అభివృద్ధిని కాంక్షించాలి. ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాల‌ని అలీ అన్నారు.

Back to Top