మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్‌ జగన్‌ దిశా నిర్దేశం

పార్టీ భ‌విష్య‌త్  కార్యాచరణ ప్రకటన

వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల 
పరిశీలకులతో అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం 

మెడికల్‌ కాలేజీల అంశంపై కోటి సంతకాల సేకరణ

గ్రామ, వార్డు స్థాయిల్లో ‘రచ్చబండ’ కార్యక్రమం

అక్టోబరు 10 నుంచి నవంబరు 22 వరకు రచ్చబండ

అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు

నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీల నిర్వహణ

నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు

నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు తరలింపు

ఆ తర్వాత గవర్నర్గారికి నివేదన. కోటి సంతకాల పత్రాల అందజేత

వైయస్‌ జగన్‌ వెల్లడి

కొత్త మెడికల్‌ కాలేజీల ప్రై వేటీకరణ చర్యలు దారుణం

ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన మొత్తం 7 కాలేజీలు

వివిధ దశల్లో ఉన్న మిగిలిన 10 మెడికల్‌ కాలేజీలు

ఏటా 1000 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో ఆ కాలేజీలు

అయినా ఆ దిశలో ఆలోచించని కూటమి ప్రభుత్వం

నాడు అదే కాలేజీల కోసం ఆర్థిక వనరులు సిద్ధం

అవేవీ పట్టించుకోని టీడీపీ కూటమి ప్రభుత్వం

మెడికల్‌ కాలేజీలు ప్రజల ఆస్తి. కాపాడుకోవాలి

మెడికల్‌ కాలేజీల వల్ల ఎన్నో ప్రయోజనాలు

అంశాలవారీగా వివరించిన  వైయస్‌ జగన్‌

టీడీపీ కూటమి పాలనపై ప్రజల్లో తొలగిన భ్రమలు

అన్ని రంగాల్లో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం

విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలన్నీ పూర్తిగానిర్వీర్యం

ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడి. ప్రభుత్వ ఖజానాకు గండి

పాలన అంటే రోజువారీ కలెక్షన్ల అన్నట్లుగా వ్యవహారం

సీఎం మొదలు, కిందిస్థాయి వరకు అదే తరహా వైఖరి

వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

కల్తీ మద్యం తయారీని పరిశ్రమలా మార్చిన ఘనులు

ఎక్కడికక్కడ ప్రాంతాలవారీగా ఫ్రాంచైజీలు. సరఫరా

ప్రజల ప్రాణాలు హరిస్తూ, అత్యంత హేయమైన దోపిడి

నాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైన్‌షాప్‌లు. మద్యం సరఫరా

ఎక్కడా అవినీతి లేకుండా, అన్ని రకాల తనిఖీలతో నాణ్యమైన లిక్కర్‌

వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం తయారీ. సరఫరా

ఒకవైపు ఖజానా దోపిడి. మరోవైపు కల్తీ మద్యం దందా

ప్రభుత్వ పెద్దలపై వైయస్‌ జగన్‌ ఫైర్  

తాడేపల్లి:  ప్ర‌భుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేప‌డుదామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు.  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో అధ్యక్షుడు  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వ పాలనపై పలు అంశాలు ప్రస్తావించిన ఆయన, పార్టీ కార్యాచరణను ప్రకటించారు. 
    ముఖ్యంగా కొత్త మెడికల్‌ కాలేజీల ప్రై వేటీకరణ, యథేచ్ఛగా, అంతు లేకుండా సాగుతున్న కల్తీ మద్యం విషయాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లాలని ఆయన నిర్దేశించారు. వాటిపై ప్రజల్లో విస్తత అవగాహన కల్పించేలా కృషి చేయాలని, ఆ దిశలో చొరవ చూపాలని ఆదేశించారు. కొత్త మెడికల్‌ కాలేజీల ప్రై వేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి, గవర్నర్కు సమర్పించనున్నట్లు  వైయస్‌ జగన్‌ వెల్లడించారు. అదే విధంగా కల్తీ మద్యానికి వ్యతిరేకంగా పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇంకా ఆ సమావేశంలో  వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..:

ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి:
    రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి భ్రమలు తొలగిపోయాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు చూసి, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూసి, ఈ ప్రభుత్వం ఏమాత్రం కళ్లార్పకుండా ఆడుతున్న అబద్ధాలను చూసి, ఏమాత్రం జంకు బొంకు లేకుండా పొడుస్తున్న వెన్నుపోట్లు చూసి ప్రజలకు పూర్తిగా భ్రమలు తొలిగిపోయాయి.     ఈరోజు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయిస పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అరాచకమే. ఎక్కడ చూసినా అవినీతి మాత్రమే కనిపిస్తున్న పరిస్థితులు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది? ఎలా పని చేస్తుందని ఒకసారి సామాన్యుడిగా ఆలోచిస్తే.. 

వారి దృష్టిలో పాలన అంటే?:
    అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాలస మీద ధ్యాస లేదు. పాలస అన్నది ఏమిటి? పాలస ఎందుకు చేస్తున్నాం? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నాడు? అనేవి చూస్తే, ఇక్కడ వీరంతా దారి తప్పి పోయారు. వీరి దష్టిలో పాలస అన్నది ఎందుకంటే.. ఈరోజు ఎంత ఆదాయం వచ్చింది?. రేపటికి ఇంకా ఎంత ఆదాయం పెంచుకోవాలి?. సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి? అన్న వాటిపై ధ్యాస మాత్రమే. 
    ఈరోజు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోంది. రాష్ట్ర ఆదాయాలు తగ్గతున్నాయి. అవి పక్కదారి పట్టి.. ఏకంగా చంద్రబాబునాయుడు ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బినామీలు, ఆయనకు సంబంధించిన మనుషుల జేబుల్లోకి పోతున్నాయి. దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏది చూసినా దోపిడీయే. ఇసుక దగ్గర సుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు అన్ని రకాలుగా  తగ్గుతున్నాయి. మరోవైపు ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. కానీ, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులు రావడం లేదు. మట్టి, సిలికా, ల్యాటరైట్‌ ఏదైనా అంతే. చివరకు లిక్కర్‌ కూడా. మద్యం అన్నది ఏ స్థాయిలోకి వెళ్లిపోయిందో మనం చూస్తున్నాం. విచ్చలవిడిగా మాఫియా కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ తమకు సంబంధించిన వాళ్లకు పావలాకు, అర్ధ రూపాయికి, రూపాయికి భూములు పంచి పెడుతున్నారు.
    విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) మన హయాంలో ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మరో 30 ఏళ్లు అందు కోసం ప్రభుత్వంపై భారం పడకూడదని యూనిట్కు రూ.2.49 చొప్పున అగ్రిమెంట్‌ చేసుకుంటే.. నానా యాగీ చేసిన వీళు ఈరోజు యూనిట్కు రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకుంటున్నారు.

గత ప్రభుత్వంలో మద్యం విక్రయాలు:
    అసలు వీరు డబ్బుల కోసం ఏ స్థాయికి దిగజారారనేది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన ప్రభుత్వ హయాంలో క్వాలిటీ లిక్కర్‌ కోసం ప్రఖ్యాతి గాంచిన డిస్టిలరీల నుంచి మాత్రమే ప్రొక్యూర్‌ జరిగేది. అవి కూడా అంతకు ముందు ప్రభుత్వం ఎంపిక చేసిన 20 డిస్టిలరీల నుంచే సేకరించాం. పూర్తి క్వాలిటీ చెక్‌ తర్వాత అవి దారి తప్పకుండా నేరుగా ప్రభుత్వ దుకాణాలకు వచ్చేవి. అప్పుడు ప్రభుత్వమే మద్యం షాప్లు నిర్వహించింది కాబట్టి, ఇష్టారీతిగా కాకుండా నిర్దిష్టమైన టైమింగ్‌ పెట్టి అమ్మేవాళ్లం. ఇంకా మద్యం షాప్లను 2,934కి తగ్గించాం. ప్రతి షాప్‌ పక్కనే ఉన్న అక్రమ పర్మిట్రూమ్లతో పాటు, 43 వేల బెల్టుషాప్‌లు పూర్తిగా రద్దు చేశాం. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే షాపులు నడిపించడం వల్ల ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదు. ఇంకా నాడు సరఫరా చేసిన లిక్కర్‌ బాటిళ్ల మీద క్యూఆర్‌ కోడ్‌ ఉండేది. వాటిని స్కాన్‌ చేసి అమ్మేవారు. అందువల్ల క్వాలిటీ అనేది నూటికి నూరు శాతం ఉండేది. 

ఇప్పుడు మొత్తం మాఫియా నెట్‌వర్క్‌:
    అదే ఈరోజు చూస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు. మద్యం సరఫరా, విక్రయాలన్నీ ఒక మాఫియా వ్యవహారంలా సాగుతోంది. ప్రభుత్వ దుకాణాలన్నీ మూసివేసి చంద్రబాబునాయుడు, ఆయన మాఫియాకు సంబంధించిన ప్రైవేటు దుకాణాలసు తెరపైకి తెచ్చారు. ఆ ప్రై వేటు షాప్లకు అనుబంధంగా పర్మిట్రూమ్లు ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో ఏకంగా వేలం పాటలు నిర్వహించి, వారికి సంబంధించిన కార్యకర్తలకు బెల్టా‡్షప్లను అప్పగించారు. వీళ్లందరికీ పోలీసులు రక్షణగా నిలుస్తున్నారు.
   బెల్ట్‌ షాపులకు వేలం పాటలు పాడి, డబ్బులు వసూలు చేసి, ఎమ్మెల్యేకు ఇంత, పోలీసులకు ఇంత, పైన పెద్దబాబుకు, చిన్నబాబుకు ఇంత అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం మొత్తం డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను నియంత్రణలోకి తీసుకున్నారు. ఒకసారి డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్, అలాగే షాపులు సడిపే వారు మొదలు గ్రామాల్లో బెల్ట్‌ షాపులు నడిపే వీళ్ల కార్యకర్తల దాకా మొత్తం వ్యవస్థను ఒక మాఫియాలా కంట్రోల్లోకి తీసుకున్న తరువాత, ఎమ్మార్పీకి మించి మద్యం అమ్ముతున్నారు.
    వైన్‌ షాప్ల పక్కనే పర్మిట్‌ రూమ్లు. అక్కడ పెగ్గుల రూపంలో మద్యం షాప్ల ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు లిక్కర్‌ అమ్మకాలు చేస్తున్నారు. మరోవైపు వేలంపాటలో గ్రామాల్లో బెల్టుషాప్లు పొందిన నిర్వాహకులు ఒక్కో బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారు. ఇలా ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తోంది.    
    మరోవైపు డిస్టిలరీల నుంచి మద్యం సేకరణలో కూడా అక్రమాలు చేస్తున్నారు. ప్రఖ్యాతి చెందిన బ్రాండెడ్‌ డిస్టిలరీల నుంచి కాకుండా బాగా డబ్బులిచ్చే (కమిషన్లు) డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తున్నారు. అలా వీళ్లకు కావాల్సిన డిస్టిలరీలకు ఇండెంట్లు ప్లేస్‌ చేసి వాళ్లకు సంబంధించిన సరుకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నారు. ఇవన్నీ వీళ్ల సొంత ఆదాయం పెంచుకునేందుకు ఒక ఎత్తు.

కల్తీ మద్యంతో అక్రమ సంపాదనకు తెగింపు:
చంద్రబాబు పరిపాలనలో రాక్షసయుగం:

    ఇది కాస్త పక్కన బెడితే, ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే, వీళ్ల డబ్బు ఆశ అనేది ఏ స్థాయికి వెళ్లిపోయిందంటే.. చివరకు ప్రజలు ఏమి తాగినా ఫర్వాలేదు. ప్రజలు చనిపోయినా ఫర్వాలేదు. మా జేబుల్లోకి డబ్బులు ఇంకా ఎక్కువగా రావాలనే తలంపు మోస్ట్‌ డేంజరెస్‌ పరిస్థితి. 
    చంద్రబాబు పరిపాలనలో ఈరోజు రాక్షసయుగం సడుస్తోంది. భయభ్రాంతులు చేస్తున్న పరిస్థితుల మధ్య ఈరోజున పోలీసులు పరిపాలన సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యం ఏరులై పారుతోంది. ప్రాంతాల వారీగా చంద్రబాబునాయుడు, ఆయసకు సంబంధించిన ఈ మాఫియాసు కంట్రోల్‌ చేసే కొంతమంది ఆయన కేబినెట్‌ మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టుల్లో ఉన్న పెద్దలు, పెద్దబాబు, చినబాబు ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారవుతోంది. ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి క్వాలిటీ లేని లిక్కరు తయారు చేసి వీళ్ల డిస్ట్రిబ్యూషన్‌ నెట్వర్క్‌  షాపుల్లోకి, బెల్ట్‌ షాపుల్లోకి నేరుగా పంపిస్తున్నారు.

ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి కల్తీ:
అది ఎలా? ఎవరు చేస్తున్నారు?:

    ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి కల్తీ బాటిల్‌. అది తాగి మనుషులు చనిపోతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్‌ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనార్ధన్రావు, సురేంద్రనాయుడు అనే వ్యక్తులు ఈ నకిలీ మద్యం దందా నడుపుతున్నారు. వీళ్లపై సూపర్వైజర్‌ బాధ్యతలు మంత్రి రాంప్రసాద్రెడ్డికి అప్పగించారు. నియోజకవర్గంలోని ములకలచెరువులో ఏకంగా పరిశ్రమను ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్యాంక్లు, క్యాన్లు, బాటిళ్లు, మూతలు, బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో లేబుళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. చివరకు దసరాకు అక్కడ యంత్ర పూజ కూడా చేశారు. అంటే అంత పకడ్బందీగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.

ఒక్కొక్కరు ఒక్కో  ఏరియా పంచుకున్నారు:
    అధికార పార్టీ అండతో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు ఏరియాలను పంచుకున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న జనార్ధన్రావు, సురేంద్రనాయుడు.. నారా లోకేష్, చంద్రబాబుతో కలిసి ఫొటోలు కూడా దిగారు. ఇక్కడ తయారైన నకిలీ మద్యం రాయలసీమలో మద్యం షాపులు, బెల్ట్‌షాప్‌లకు పంపిణీ చేసే బాధ్యతను మంత్రి రాంప్రసాద్రెడ్డి సూçపర్‌వైజ్‌ చేస్తున్నారు.
    కృష్ణా, గుంటూరు జిల్లాలో ఈ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేందుకు విజయవాడ చేరువలోని ఇబ్రహీంపట్నంలో ఏకంగా రెండు చోట్ల భారీగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ నుంచి రవాణా చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇబ్రహీంపట్నంలోనే యూనిట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లే బాటిళ్లు, లేబుల్స్, మూతలు తయారు చేసుకుంటారు. వీళ్లే బ్రాండ్లు కూడా ప్రమోట్‌ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కాటన్బాక్సో్ల స్పిరిట్‌ నింపిన డ్రమ్స్, ఖాళీ సీసాలు, బాటిల్సు్న చూసి ఎక్సైజ్‌ శాఖ అధికారులే విస్తుపోతున్నారట. 
    నర్సీపట్నంకు చెందిన పార్టీ నేత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూసుకుంటారు. ఈయన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడు. ఏలూరుకు చెందిన వివాదస్పద ఎమ్మెల్యేకు బాగా దౌర్జన్యం చేస్తాడని ఆయనకు ఉమ్మడి గోదావరి జిల్లా బాధ్యతలు అప్పగించారు. పాలకొల్లులో మరో పరిశ్రమ. అక్కడ కూడా మిషన్, క్యాన్లు, బాటిళ్లు, లేబుల్స్‌ అన్నీ నీట్గా ఏర్పాటు చేశారు. అమలాపురంలో కూడా మిషన్లు, బాక్సు్ల, కల్తీ మద్యం, బాటిల్స్, లేబుల్స్, మూతలు, స్పిరిట్‌ అన్నీ నీట్గా అమర్చారు. మాస్కులతో అక్కడ పని చేసే వారిని కప్పిపెట్టారు. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడలో కూడా పరిశ్రమ ఏర్పాటు చేశారు. 

నకిలీ మద్యానికి అమాయకుల బలి:
    ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులోని ఓ మద్యం షాప్‌లో లిక్కర్‌ తాగిన కొద్దిసేపటికే షేక్‌ చిన్న మస్తాన్‌ మరణించాడు. జూపూడి వైన్‌ షాప్‌లో మద్యం తాగి ఇంటికి వెళ్తూ కిలేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వైన్షాపులో మద్యం సేవిస్తూ బెల్దారీ పెద్దన్న అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఇలా నకిలీ మద్యానికి ఈ మాదిరిగా అమాయకులు బలి అవుతున్నారు. 
(అంటూ ఆ ఫోటోలను పీపీటీలో చూపారు)

దాడుల్లో ఏమేం స్వాధీనం చేసుకున్నారంటే..:
    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డబ్బుల కోసం ఏ స్థాయిలోకి దిగజారి పోతున్నారంటే, సొంత ఆదాయాలు పెంచుకునేందుకు, రాష్ట్ర ఖజానాను లూటీ చేయడంతో సరిపెట్టుకోకుండా, అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడటం మరో ఎత్తు. ఆయన రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేస్తున్నారో ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది. 
    ఇబ్రహీంపట్నం గోడౌన్లలో దాడులు చేసి నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం మిషన్లు, పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, లేబుల్స్‌ లేని బాటిల్స్, స్పిరిట్ను ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో 3,325 లీటర్ల స్పిరిట్ను సీజ్‌ చేశారు. అందులో ఓల్డ్‌ అడ్మిరల్‌ బ్రాందీ 725 బాటిల్స్, క్లాసిక్‌ బ్లూ 44  బాటిల్స్, కేరల మాల్ట్‌ 384 బాటిల్స్, మంజీరా బ్లూ 24 బాటిల్స్, ఇలా మొత్తం 1300 బాటిల్సు్న ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదిరిగా లేబుల్స్‌ లేని 136 కేసులు, అందులో 6,578 బాటిల్స్, ఓఏబీ లేబుల్స్‌ 6,500, ఖాళీ బాటిల్స్‌ 22 వేలు, ఖాళీ కార్టూన్లు 6, ఒక మిషన్, రెండు పైపులను సీజ్‌ చేశారు. ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

బాబు ష్యూరిటీ పోయింది. మోసం గ్యారెంటీ వచ్చింది:
    మరోవైపు చూస్తే బాబు ష్యూరిటీ పోయి మోసం గ్యారెంటీ అయ్యింది. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ సెవెన్ల పేరుతో ఎన్నికలకు ముందు ఈనాడులో ఆయనిచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇప్పటికే చాలా సార్లు చూపించా. అలాగే మొన్న అనంతపురంలో విజయోత్సవ సభ జరుపుకుంటూ.. అన్నీ చేసేశామని చెబుతూ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు చూపించా. 
    ఆ హామీలు ఎలా మారిపోయాయో వివరించాను. ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి మహిళకు ప్రతినెలా రూ.1500 ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చాక తీసేశారు. నిరుద్యోగ భతి పేరుతో నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇస్తామని చెప్పారు. విజయోత్సవ సభ పేరుతో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఏకంగా నిరుద్యోగ భతి హామీ తీసేశారు. ఎన్నికలకు ముందు కనిపించిన 50 ఏళ్ల పింఛన్‌ పేరుతో ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.48 వేలు హామీ విజయోత్సవ సభకు వచ్చేసరికి మాయమైంది. ఆ పార్ట్‌ కూడా కటింగే. ఏ రకంగానైతే సూపర్‌ సిక్స్‌ సూపర్‌ సెవెన్‌ పోయి.. బాబు ష్యూరిటీ అనేది పోయి మోసం గ్యారెంటీ గా మిగిలిన పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.  

విద్యావ్యవస్థ నిర్వీర్యం:
    రాష్ట్రంలో ఇప్పుడు విద్యారంగాన్ని ఏవిధంగా నాశనం చేస్తున్నారో చూస్తే బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా మన హయాంలో చూస్తే జగన్‌ అనే వ్యక్తి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఇంకో ఐదేళ్లు పరిపాలన చేసుంటే.. ప్రతి గవర్నమెంట్‌ స్కూల్‌ నుంచి వచ్చిన పిల్లాడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి మన హయాంలో చదివిన వాడు ఇంగ్లిష్‌ మీడియం, ఐబీ సర్టిఫికెట్తో పాసయ్యేవాడు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు అటెండ్‌ అవుతూ పదో తరగతి పూర్తయ్యే నాటికి వెస్ట్రన్‌ యాక్సెంట్‌ (అమెరికన్‌ యాక్సెంట్‌)తో అనర్గళంగా ఇంగ్లిష్‌ మాట్లాడేవాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. 
    ఎనిమిదో తరగతి పిల్లాడు మనమిచ్చే ట్యాబ్లతో ఐబీ చదువులు, టోఫెల్లో ఉత్తీర్ణత సాధించేవాడు. ట్యాబ్లతో ఏకంగా ఇంటర్నెట్తో అనుసంధానమై సాఫ్ట్వేర్‌ మీద అవగాహన వచ్చేది. సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చాం. ఇవన్నీ కలిపి ఆ పిల్లాడు ఏ స్టేజ్కి వచ్చే వాడంటే ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్‌ గేట్‌ వే గా నిలిచేది. అటువంటి కమ్యూనికేషన్‌ స్కిల్స్, అటువంటి నాలెడ్జ్‌ బేస్డ్‌ ఎడ్యుకేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతి పేద, మధ్యతరగతి పిల్లలకు అందుబాటులోకి తెచ్చాం. 
    ఈరోజు కేవలం చంద్రబాబు, రామోజీ, ఆంధ్రజ్యోతి ఎండీ మనవళ్లు మాత్రమే ఈ ఐబీ చదువులు చదివారు. వాళ్లలో ఎవరూ తెలుగు మీడియం చదవడం లేదు. కానీ మన దగ్గరకి వచ్చేసరికి వీళ్లంతా కుట్ర పన్ని పేదవాడి మీద, మిడిల్‌ క్లాస్‌ వారి మీద రాక్షసుల మాదిరిగా యుద్ధం చేసి ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇంగ్లిష్‌ మీడియంలోఐబీ నుంచి సీబీఎస్‌ఈ వరకు పేదవాడి ప్రయాణాన్ని అడ్డుకున్నారు. మూడో క్లాసు నుంచి ఉన్న టోఫెల్‌ క్లాసులు పూర్తిగా రద్దై పోయిన పరిస్థితి. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇవ్వకపోగా కనీసం దాని పేరెత్తే ధైర్యం కూడా వీరికి లేదు. మన హయాంలో మూడో తరగతి నుంచే ఉన్న సబ్జెక్టు టీచర్‌ కాన్సెప్టు ఇప్పుడు ఊసే లేదు. నాడు–నేడు పనులు పూర్తిగా ఆగిపొయాయి.

దారుణంగా గవర్నమెంట్‌ స్కూళ్లు:
    బాధ ఎక్కడ కలుగుతుందంటే స్కూల్స్‌ నాడు–నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. చివరకు నిర్వహణ కూడా చేయలేని అధ్వాన్నస్థితిలోకి విద్యా వ్యవస్థను నెట్టేశారు. రోజుకొక మెనూతో గోరు ముద్ద అనే కార్యక్రమం మన హయాంలో ఎంతో గొప్పగా నిర్వహిస్తే ఇప్పుడది కనుమరుగైపోయింది. ఈరోజు గవర్నమెంట్‌ స్కూల్సో్ల ఏకంగా 5 లక్షల మంది పిల్లలు తగ్గిపోయిన పరిస్థితి. మన హయాంలో గవర్నమెంట్‌ స్కూల్స్‌ లో నో వేకెన్సీ బోర్డులు చూశాం. గవర్నమెంట్‌ స్కూళ్ల‌లో సీటు కోసం ప్రజలు ఏకంగా ఎమ్మెల్యేల రికమండేషన్‌ లెటర్స్‌ కోసం వచ్చిన పరిస్థితులు మన హయాంలో చూశాం. 
    అదే ఈరోజు గవర్నమెంట్‌ స్కూళ్ల‌ పరిస్థితి చూస్తే 5 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అమ్మ ఒడి పేరుతో మనం తీసుకొచ్చిన పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగురగొట్టేశారు. రూ.15 వేలు కాస్తా రూ.13 వేలు చేశారు. ఆ రూ.13 వేలు కూడా ఇవ్వకుండా  కొందరికి రూ.9 వేలు, కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.

వ్యాధుల బారిన పిల్లలు:
    నిజంగా బాధ ఎక్కడ కలుగుతుందంటే నాడు–నేడు అనే కార్యక్రమం ద్వారా బడుల రూపురేఖలు మార్చే గొప్ప కార్యక్రమం మనం చేస్తే, ఇప్పుడు ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగ్గా చేయక కురుపాంలో ఏకంగా ఇద్దరు పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామెర్లు సోకాయి. 30 మంది పిల్లలు ఇంకా ఆస్పత్రుల్లోనే ఉన్నారు. నెలరోజుల క్రితం జాండిస్‌ కేసులు బయటపడితే కనీసం పట్టించుకున్న నాథుడే లేడు. మన మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వెళితే తప్ప వారిలో కదలిక రాలేదు. 

విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు:
    ఏప్రిల్లో వెరిఫికేషన్‌ చేసి మేలో ఫీజురీయింబర్సె్మంట్‌ ఇస్తుంటాం. కానీ 2024 మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ఇవ్వలేకపోయాం. అక్కడి నుంచి పోస్ట్పోన్‌ చేసుకుని 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్సె్మంట్‌  ఇప్పుడు 2025 సెప్టెంబర్‌ నాటికి 7 త్రైమాసికాలు. ప్రతి క్వార్టర్కి సుమారు రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏడు త్రైమాసికాలకు గాను దాదాపు రూ.4500 కోట్లు. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమ. మిగతాదంతా గాలికొదిలేశారు. 
    వసతి దీవెన కింద మన హయాంలో ప్రతి ఏప్రిల్లో రూ.1100 కోట్లు ఇచ్చేవాళ్లం. 2024 ఎలక్షన్‌ కోడ్‌ కారణంగా ఆగిపోయింది. ఏప్రిల్‌ 2025 మరో రూ.1100 కోట్లు. రెండేళ్లకు కలిపి రూ.2200 కోట్లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూర్తిగా నిలిపేశారు. దీంతో పిల్లులు చదువులు మానుకుంటున్న పరిస్థితి. 

వ్యవసాయం అసహాయ పరిస్థితుల్లో..:
    పంటల పరిస్థితి ఇక చెప్పాల్సిన పని లేదు. రైతులకి మనమిచ్చిన ఉచిత క్రాప్‌ ఇన్సూరెన్స్‌ గాలికి ఎగిరిపోయింది. సమయానికిచ్చే 
ఇన్పుట్‌ సబ్సిడీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఈ క్రాప్‌ అనేది ఈరోజు కనపడకుండా పోయింది. మన హయాంలో ఆర్బీకేల పరిధిలో సీఎం–యాప్‌ (కంటిన్యువస్‌ మానిటరింగ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్మెంట్‌) కింద ఏ పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకేలోఅలెర్ట్‌ వచ్చేది. అక్కడున్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ అలెర్ట్‌ ఇచ్చేవాడు. మారŠెక్ఫడ్‌ కి సంబంధించి జాయింట్‌ ఎండీ హోదాలో ఆ అలెర్ట్‌ ఆధారంగా జాయింట్‌ కలెక్టర్‌ వెంటనే ఇంటర్వీన్‌ అయ్యేవాడు. వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేలా ఇంటర్వెన్షన్‌ జరిగేది. ఫలానా పంటకు గిట్టుబాటు ధర ఇది అని ఆర్బీకేలలో ఒక ఛార్ట్‌ వేసేవాళ్లం. అంతకన్నా ధర తగ్గితే అలెర్ట్‌ వచ్చేది.
    ఇప్పుడు ఆర్బీకేలు పోయాయి. ఈ క్రాప్‌ పోయింది. ఉచిత పంటల బీమా పోయింది. సమయానికిచ్చే ఇన్పుట్‌ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది.
రైతు భరోసాగా మనం పెట్టుబడి సహాయం కింద ప్రతి ఏడాది క్రమం తప్పకుండా రూ.13500 చొప్పున ఇచ్చి రైతుకు అండగా నిలిచే కార్యక్రమం మనం చేస్తే, కళ్లబొల్లి మాటలతో రైతులకు భ్రమ కల్పించారు. అది నమ్మిన రైతుల పరిస్థితి నేడు దారుణంగా తయారైంది.
    రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నాడు. పీఎం కిసాన్‌ ఇచ్చే రూ.6 వేలు కాకుండా మేమే రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లకు కలిపితే రూ.40 వేలకుగాను ఇచ్చింది కేవలం రూ.5 వేలు. ఏ పంట తీసుకున్నా కనీసం గిట్టుబాటు ధర లేదు. ఏ పంట తీసుకున్నా నష్టమే. ధాన్యం కొనుగోలు దగ్గర్నుంచి మొదలుపెడితే మిర్చి, పొగాకు, అరటి, మామిడి, టమాటా, సజ్జలు, పెసలు, మినుములు, చినీ.. ఈ ఏడాది మళ్లీ తీసుకుంటే ఉల్లి, టమాట, చినీ పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడ చూసినా కూడా దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కల్తీలు, దళారీలే.

నాడు ఏనాడైనా రైతు రోడ్డెక్కాడా?:
    నిజంగా నాకు ఆశ్చర్యమనిపించింది. ఐదేళ్ల మన పరిపాలన చూశాం. ఏ రోజైనా రైతులు ఎరువుల కోసం రోడ్డెక్కడం ఏనాడైనా చూశామా? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పని చేస్తుందా? చివరికి ఎరువుల్లో కూడా స్కాములు చేస్తున్నారు. ఎరువులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయాల్సింది పోయి.. ప్రైవేటుకి ఎక్కువగా కేటాయించి.. ప్రైవేటు దళారీలతో వీళ్లు డీల్‌ సెట్‌ చేసుకుని.. వాళ్లు దాన్ని బ్లాక్‌ చేసి.. రేట్లు ఎక్కువ పెట్టి రూ.263 విలువ చేసే యూరియాకు.. మరో రూ.263 ఎక్స్‌ ట్రా రేటుకు అమ్మేలా.. అందులో వీళ్లకి ఇంత కమీషన్‌ మాట్లాడుకుంటున్నారు. 

వైద్యం. హరీ.. రంగం నిర్వీర్యం:
    వైద్య రంగం గురించి నేను చెప్పాల్సిన పనిలేదు. మన హయాంలో గ్రామాలకు తల ఎత్తుకుని పోయే వాళ్లం. మన హయాంలో అక్కడ విలేజ్‌ క్లీనిక్లు కనిపించేవి. 14 రకాల వైద్య పరీక్షలు చేసేవారు. 105 రకాల మందులు అందుబాటులో ఉండేవి. అక్కడే ఏఎన్‌ఎంలు రిపోర్టింగ్‌ చేసేవారు. ఇంకా అక్కడే కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ఉండేవాడు. వారంతా రోజంతా, వారం రోజుల పాటు.. 24/7 పని చేసేవారు.
    ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌.. ప్రతి పీహెచ్‌ సీలో ఇద్దరు డాక్టర్లు, సీహెచ్సీల దగ్గర నుంచి జిల్లా ఆస్పత్రులు, అక్కణ్నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకు.. అన్ని ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ. ఎక్కడ ఏ మెడికల్‌ ఆఫీసర్‌ అవసరం ఉన్నా, వెంటనే నియమించాం. 
    దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే.. మన హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ డాక్టర్ల కొరత కేవలం 4 శాతం మాత్రమే. అలాంటి వ్యవస్థ ఈ రోజు పూర్తిగా దిగజారిపోయింది.
    ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచాం. 1000 ప్రొసీజర్లను 3,300 ప్రొసీజర్ల వరకు తీసుకుపోయాం. ఆరోగ్య శ్రీనే కాకుండా ఆరోగ్య ఆసరా తీసుకువచ్చాం. పేషంట్కు శస్త్రచికిత్స తర్వాత రెస్ట్‌ పిరియడ్‌ లో ఆదుకుంటూ, నెలకు రూ.5 వేలు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అవన్నీ తెరమరుగైపోయాయి. అసలు ఆరోగ్య శ్రీని నడపడానికి కావల్సింది నెలకు రూ.300 కోట్లు. ఈ 16 నెలలకు గాను రూ.4,800 కోట్లు. కానీ, ఈ పెద్ద మనిషి రూ.1000 కోట్లు కూడా ఇవ్వలేదు. దాదాపు రూ.3,800 కోట్లు పెండింగ్‌ పెట్టేసరికి, నెట్వర్క్‌ ఆస్పత్రులు సేవలు నిలిపేశాయి. 
    ఇంకా 108, 104 సర్వీస్ల నిర్వహణ స్కాముల మయం. కనీసం రూ.5 కోట్ల టర్నోవర్‌ కూడా లేని, టీడీపీ ఆఫీస్‌ బేరర్గా ఉన్న ఒకరికి 108, 104 సర్వీసుల నిర్వహణ కాంట్రాక్ట్‌ అప్పగించారు. ఇంక అది కుయ్‌.. కుయ్‌ అని ఏమంటుంది? బుయ్‌.. బుయ్‌ అంటుంది.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ:
    మరో బాధాకరమైన అంశం ఏంటంటే.. అసలు పేదలకు ఇంకా అన్యాయం చేస్తూ వారిని మరింత పేదరికంలోకి నెట్టేస్తున్నారు. భవిష్యత్తులో కూడా పేదలకు మంచి జరగకుండా చేసేందుకు, మనం మన హయాంలో ఏర్పాటు చేసిన 17 మెడికల్‌ కాలేజీల్లో 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెడుతున్నారు.
    రాష్ట్రంలో 1923 నుంచి 2019 వరకు కేవలం 12 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మనం ఒక విజన్తో ఏకంగా 17 మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చాం.
    అందరూ సీరియస్‌ గా ఆలోచన చేయాలని కోరుతున్నా.. ప్రజల్లోకి మీరు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని మాట్లాడమని కోరుతున్నా. అసలు గవర్నమెంట్‌ ఎందుకు స్కూళ్లను నడుపుతుంది? గవర్నమెంట్‌ ఎందుకు ఆస్పత్రులను నడుపుతుంది? గవర్నమెంట్‌ ఎందుకు ఆర్టీసీ బస్సులను నడుపుతుంది? రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా.. వాటిని ప్రభుత్వాలే ఎందుకు నడుపుతున్నాయి... ప్రభుత్వాలు ఇవి చేయకపోతే.. ప్రైవేటు ఎక్సŠాప్లయిటేషన్‌ (దోపిడీ) జరుగుతుంది. ప్రభుత్వం కనుక ఆస్పత్రులను నడపకపోతే.. ప్రైవేటు హాస్పటళ్లలో ఈ దోపిడీ వల్ల ఏ పేదవాడికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుంది.
    ప్రభుత్వం కనుక స్కూళ్లను నడపకపోతే.. నారాయణ, చైతన్య యజమాన్యానికి ఫీజులు కట్టలేక..õ ³దలు తమ పిల్లలను చదవించలేని పరిస్థితులకు వెళ్లిపోతారు. గవర్నమెంట్‌ ఆర్టీసీ బస్సులను నడపకపోతే.. ప్రైవేటు వాళ్ల దెబ్బకు ఎవరూ కూడా.. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. అందుకే గవర్నమెంట్‌ వీటన్నింటిలో ఎంటరవుతుంది. అందుకనే ప్రభుత్వం సూళ్లను, బస్సులను, హాస్పటళ్లను నడుపుతుంది. లేదంటే ప్రైవేటు దోపిడికి అడ్డూ అదుపూ ఉండదు. 

ఆ లక్ష్యంతోనే కొత్త మెడికల్‌ కాలేజీలు:
    మనం ప్రతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ను ఒక జిల్లాను చేశాము. ఆ ప్రతి ఏడు లేదా 8 అసెంబ్లీ సెగ్మెంట్లను ఒక జిల్లాను చేయడమే కాకుండా.. ప్రతి జిల్లాలో ఒక టీచింగ్‌ హాస్పటల్‌ ను తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. ఒక మెడికల్‌ కాలేజీ తీసుకువచ్చాం. మెడికల్‌ కాలేజీ వల్ల జరిగే ఒక మంచి ఏంటీ అంటే.. ఒక మెడికల్‌ కాలేజీ జిల్లా హెడ్‌ క్వార్టర్సు్క వస్తుందో, ఆ 8 సెగ్మెంట్లకు సంబంధించి ప్రైవేటు దోపిడి ఆగిపోతోంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, మెడికల్‌ స్టూడెంట్లు, నర్సింగ్‌ స్టూడెంట్లు టీచింగ్‌ హాస్పటల్లో పని చేస్తారు. రకరకాల విభాగాలతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్‌ సేవలు అక్కడ అందుబాటులోకి వస్తాయి. ఇంకా అక్కడ పేదవారికి, మధ్య తరగతి వారికి ఉచితంగా వైద్యం అందుబాటులోకి తీసుకురాగలుగుతాం.
    ఇవి ఒకటే కాదు.. జిల్లాలోని మిగిలిన విలేజ్‌ క్లీనిక్స్‌ దగ్గర నుంచి.. పీహెచ్సీల దగ్గర నుంచి.. సీహెచ్సీల దగ్గర నుంచి.. డిస్ట్రిక్‌ హాస్పిటల్స్‌ దగ్గర నుంచి జిల్లా హాస్పిటల్‌ వరకు ఈ టీచింగ్‌ హాస్పిటల్‌ ఒక గైడ్‌ గా పని చేస్తుంది. ప్రతి విలేజ్‌ క్లీనిక్‌ లో వీడియో కాన్ఫరెన్స్‌ ఫెసిలిటీ æకల్పించాం. అక్కడ నుంచి ఏఎన్‌ఎంకు పేషెంట్లకు అందించాల్సిన ట్రీట్మెంట్పై సలహా ఇచ్చేందుకు జిల్లా కేంద్రంలో ఉన్న టీచింగ్‌ ఫ్యాకల్టీ అందుబాటులోకి వస్తారు. అలా ఒక జిల్లా మొత్తానికి టీచింగ్‌ హాస్పటల్‌ ఒక హబ్‌ గా పని చేస్తుంది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందుతుంది. అందుకే ప్రివెంట్‌ కేర్‌ అనేది మన పాలనలో ఒక సువర్ణాధ్యాయంగా నిలబడిపోయింది. 

మెడికల్‌ సీట్లు పెరిగేవి:
    నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మెడికల్‌ సీట్లు 2360 మాత్రమే. మనం ఏర్పాటు చేసి 17 మెడికల్‌ కాలేజీల ద్వారా మరో 2,550 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చేవి. మొత్తంగా 4,900 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటికి వచ్చే పరిస్థితి. అంటే ఇంత మంది డాక్టర్లు మన రాష్ట్రంలో అందుబాటులో ఉండే పరిస్థితి. అది కూడా మెడికల్‌ సీట్లలో 50 శాతం కోటా ఉచితం. గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు కాబట్టి మిగిలిన 50 శాతం సీట్లు కూడా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలతో పోలిస్తే తక్కువ ఫీజుకే విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. 
    కాగా, సీఎం చంద్రబాబు ఇప్పుడు ఒక రకంగా ప్రైవేటీకరణ ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాడు. ఇంకా ఉచిత వైద్యం పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నాడు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుకు అమ్మేస్తూ.. ప్రైవేటు ఎక్సŠాప్లయిటేషన్కు దారి వేస్తూ.. పేదవాడిని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. 

ఏడు కాలేజీలు పూర్తి చేశాం:
    మన హయాంలో 17 మెడికల్‌ కాలేజీలు మొదలుపెట్టి, వాటిలో అయిదింటిని పూర్తి చేశాం. ఆ 5 మెడికల్‌ కాలేజీలతో పాటు, పాడేరు మెడికల్‌ కాలేజీని కూడా కలుపుకుంటే 800 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. 2023–24 విద్యా సంవత్సరంలోనే మెడికల్‌ కాలేజీలు ప్రారంభించాము. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల.. ఐదు మెడికల్‌ కాలేజీలు మనం అధికారంలో ఉండగానే 2023–24లోనే ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు.. పాడేరు, పులివెందుల మెడికల్‌ కాలేజీలను స్టార్‌ చేసేందుకు చంద్రబాబు రాకముందే కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చేసింది. పులివెందుల మెడికల్‌ కాలేజీకి 50 మెడికల్‌ సీట్లు శాంక్షన్‌ అయితే.. మాకొద్దంటూ చంద్రబాబు ఎన్‌ఎంసీకి లేఖ రాయించాడు. అంటే దాని అర్థం 17 మెడికల్‌ కాలేజీలకు గాను 7 మెడికల్‌ కాలేజీలు సబ్‌ స్టాన్షియల్‌ ప్రోగ్రెస్‌ సాధించినట్లే.

ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా?:
    దాదాపు రూ.3 వేల కోట్లు మెడికల్‌ కాలేజీలకు ఖర్చు చేశాం. మిగిలింది 5 వేల కోట్లు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రం సంవత్సరానికి 1000 కోట్లు చొప్పున మిగిలిన మెడికల్‌ కాలేజీలు పూర్తి చేయడానికి ఖర్చు పెట్టలేరా? మిగిలిన వాటిని పూర్తి చేయడానికి మన హయాంలోనే నాబార్డ్‌ ఫండింగ్‌ తీసుకువచ్చాం. సెంట్రల్‌ గవర్నమెంట్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ అనే పథకంలో మెడికల్‌ కాలేజీలను కూడా పెట్టించాను. 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణం స్పెషల్‌ అసిస్టెన్స్‌ కింద ఇస్తారు. 
    నేను చంద్రబాబును అడుగుతున్నా. మెడికల్‌ కాలేజీల కోసం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇవ్వలేరా? సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇవ్వలేరా?. సో కాల్డ్‌ అమరావతిలో రూ.70 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని చెబుతున్నావు. ఇప్పుడున్న 50 వేల ఎకరాలు సరిపోవు. ఇంకో 50 వేల ఎకరాలు కావాలి అని అడుగుతున్నారు. మొదట 50 వేల ఎకరాలను డెవలప్‌ చేయడానికి చంద్రబాబు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే కావాల్సింది లక్ష కోట్లు. కానీ, ఇంతకు ముందు ఖర్చు చేసింది చూస్తే రూ.4500 కోట్లు. అది అలా ఉండగానే, మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. అంటే అక్కడ మరో లక్ష కోట్ల ఖర్చుకు సిద్దమయ్యారు. అంటే మొత్తం రెండు లక్షల కోట్లు అమరావతిలో పెట్టడానికి సిద్దమయ్యారు. 
    అలాంటిది రాష్ట్రంలోని కొన్ని లక్షల మందికి ఉపయోగపడే కొత్త మెడికల్‌ కాలేజీల కార్యక్రమం. కోట్ల మందికి చిరస్థాయిగా నిల్చిపోయే ఆస్తి. భవిష్యత్తులో ప్రైవేటు వారు పేదలను దోచుకోకుండా ఉండే కార్యక్రమానికి శ్రీరామరక్ష. అలాంటి కార్యక్రమానికి కేవలం అయిదేళ్ళలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేరా? ఆశ్చర్యంగా ఉంది.

ఈనెల 9 నుంచి కార్యాచరణ:
    ఈ నేపథ్యంలో వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్నాం. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని ఈనెల 9న నేను సందర్శిస్తున్నాను. ఆ రోజుతో ఈ కార్యాచరణ ప్రారంభమవుతుంది. 
    ఆ మర్నాడు 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ కార్యక్రమం మొదలై నవంబరు 22 వరకు కొనసాగుతుంది. అక్టోబరు 28న నియోజకవర్గ కేంద్రాల్లోనూ, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లోనూ ర్యాలీలు నిర్వహిస్తాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఆ మర్నాడు నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు తరలిస్తారు. అనంతరం గవర్నర్గారిని కలిసి అన్ని విషయాలు నివేదిస్తాం.సేకరించిన కోటి సంతకాల పత్రాలు కూడా ఆయనకు అందజేస్తాం.

ఇలా ఆ కార్యక్రమాల నిర్వహణ:
    ఈ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలో విస్తతంగా ప్రచారం చేస్తాం. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల జరిగే నష్టాన్ని, సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ పేరుతో చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తాం. అదే సమయంలో ఆ గ్రామంలో మన పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. 
    దాని తర్వాత మెడికల్‌ కాలేజీల వ్యవహారానికి సంబంధించి, నేను గతంలో మాట్లాడిన దాని వివరాలతో క్యూఆర్‌ కోడ్తో ముద్రించిన పాంప్లెట్ను, కోటి సంతకాల సేకరణ కోసం క్యూఆర్‌ కోడ్తో రూపొందించిన లెటర్‌ కాపీలను కూడా గ్రామంలో గ్రామ కమిటీలు, అనుంబంధ సంఘాల అధ్యక్షులకు ఇవ్వాలి. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 100 పంచాయతీలు ఉంటాయనుకుంటే, ప్రతి పంచాయతీ నుంచి మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కాపాడుకునేందుకు కనీసం 500 మందితో సంతకాలు సేకరిస్తాం. ఆ బాధ్యతను కొత్తగా వేసిన గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాలకు అప్పగిస్తాం. వారు ప్రజలను చైతన్యపరుస్తూ సంతకాలను సేకరిస్తారు. ఈనెల 10 నుంచి నవంబరు 22 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
     ఒకవైపు గ్రామాల్లో సంతకాల సేకరణ జరుగుతుండగానే, మరోవైపు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల వారితో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ఇంకా ప్రతి నియోజకవర్గం ఇన్చార్జ్‌ ప్రతిరోజూ రెండు గ్రామాలను సందర్శించి సంతకాల సేకరణ కార్యక్రమం పర్యవేక్షించి, అక్కడే మీడియాతో మాట్లాడతారు. 
    ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే అక్టోబర్‌ 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీ నిర్వహించి, నియోజకవర్గ స్థాయి అధికారికి  డిమాండ్‌ పత్రాన్ని అందచేస్తాం. అప్పుడు ఏదో ఒక నియోజకవర్గంలో నేను స్వయంగా ర్యాలీలో పాల్గొంటాను. అనంతరం నవంబర్‌ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు అందజేస్తారు.

ఇలా సంతకాల పత్రాల తరలింపు. సమర్పణ:
    అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, ఆ మర్నాడు నవంబరు 24న జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు తరలిస్తారు. 
    తదుపరి గవర్నర్గారి అపాయింట్మెంట్‌ తీసుకుని, ఆయన్ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తాం. అలాగే కోటి సంతకాల పత్రాలు కూడా ఆయనకు అందజేస్తాం.

కల్తీ మద్యంపై ఇలా ఆందోళన:
    అలాగే కల్తీ మద్యం వ్యవహారంపై కూడా పార్టీ పరంగా నిరసనలు తెలియచేయాలి. ప్రతి మూడు బాటిళ్ళలో ఒకటి కల్తీ మద్యం విక్రయిస్తున్నారు, కల్తీ మద్యం వద్దు, మా ప్రాణాలను కాపాడాలని, అయ్యా చంద్రబాబు... మా ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఒక నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గ కేంద్రంలోని మద్యం దుకాణాల వద్ద ప్లకార్డ్లతో ఆందోళనలు చేయాలి. ఇందులో మహిళా విభాగాన్ని కూడా భాగస్వామిని చేయాలి. మద్యం సేవించే వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, పేదల ప్రాణాలతో ఆటలాడతారా అంటూ కల్తీ మద్యంపై నిరసనలు తెలియచేయాలి. నియోజకవర్గ ఇన్చార్జీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించాలి. 

ఉద్యోగులకు తోడుగా..:
    ఇది కాకుండా సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఐఆర్, పీఆర్సీ, నాలుగు డీఏలు పెండింగ్‌ తదితర సమస్యలపై ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. మనం సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ తీసుకువచ్చి, ఉద్యోగులకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తే, వారు దానిపై దుష్ప్రచారం చేశారు. ఓపీఎస్‌ ఇస్తామని చెప్పి మోసం చేశారు. వీటన్నింటిపైనా.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా మన వంతు కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలి. అలా మనం ఉద్యోగులకు తోడుగా ఉన్నామన్న భరోసాను వారికి కల్పించడంతో పాటు, ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చాటేలా కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీ వైయస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు.

Back to Top