క‌లాం మాట‌లు నేటి యువ‌త‌కు ఆద‌ర్శం

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

తాడేప‌ల్లి: మాజీ రాష్ట్రపతి, భార‌త‌ర‌త్న అబ్దుల్ కలాం జయంతి వేడుక‌ను తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి వైయస్ఆర్ సీపీ రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, శాస‌నమండ‌లి స‌భ్యులు లేళ్ల  అప్పిరెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..  అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు అందరికీ ఆదర్శం అని అన్నారు. కలలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయండి అంటూ కలాం చెప్పిన మాటలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ లేళ్ల  అప్పిరెడ్డితో పాటు పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, మాదిగ కార్పొర్పోరేషన్ చైర్మన్ శ్రీ కనకారావు మాదిగ, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటనారాయణ, కృష్ణాజిల్లా డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ తదితరులు పాల్గొని క‌లాం చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘన నివాళులు అర్పించారు.

తాజా వీడియోలు

Back to Top