ఈ నెల 30న మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి సంగం బ్యారేజీ జాతికి అంకితం

పొట్టిశ్రీ‌రాములు నెల్లూరు జిల్లా: పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం  బ్యారేజీని  సీఎం వైయ‌స్‌ జగన్  ఈ నెల 30 జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మహానేత వైయ‌స్ఆర్, దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాలను సీఎం వైయ‌స్ జగన్ ఆవిష్కరించనున్నారు. 

ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణం గురించి, దాని రైతాంగం ఎలా లబ్ధిపొందుతుంది తదితర వివరాలను ఇటీవ‌ల ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి సీఎం వైయ‌స్‌ జగన్‌కు వివరించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనుల గురించి చెప్పారు. ఇంకా చేయాల్సిన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.  బ్యారేజీని ప్రారంభిస్తున్న నేపథ్యంలో సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి విక్రమ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top