భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో రెండో రోజు జ‌నాగ్ర‌హ దీక్ష‌

నిర‌స‌న దీక్ష‌లో పాల్గొన్న మంత్రులు అవంతి శ్రీ‌నివాస‌రావు, తానేటి వ‌నిత‌

విశాఖ‌:  తెలుగుదేశం పార్టీ నేతల బూతు పురాణాన్ని నిరసిస్తూ..  వైయ‌స్ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్ర‌వారం భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ శ్రేణులు  రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు  జనాగ్రహ దీక్షలు కొన‌సాగిస్తున్నారు. టీడీపీ నాయ కుడు పట్టాభి ఉపయోగించిన బూతు పదాలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని నినదిస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలోని తగరపువలస జంక్ష‌న్‌లో ఏర్పాటు చేసినా దీక్షా శిబిరంలో మంత్రులు ముత్తంశెట్టి.శ్రీనివాసరావు,  తానేటి.వనిత, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బూతు పదజాలంతో దూషించడంలో పట్టాభి వెనుక చంద్రబాబు హస్తం ఉందని.. వెంటనే ఆయన సీఎంకు క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేశారు.  టీడీపీ నేతలు చేసిన తీవ్ర వ్యాఖ్యలను వారు ఖండించింది. పట్టాభి దురుసు వ్యాఖ్యలకు చంద్రబాబే కారణమని మండిప‌డ్డారు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

Back to Top