వంద పడకల ఆసుప‌త్రి నిర్మాణానికి భూమి పూజ‌

తూర్పుగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి  ఆశీస్సులతో పేద ప్రజల సౌకర్యార్థం మండ‌పేట‌లో సుమారు రూ. 35 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ కి  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  భూమి పూజ చేశారు. మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో క‌లిసి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. త్వ‌ర‌లోనే నిర్మాణ ప‌నులు పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చాక పేద‌లు వైద్యం కోసం అప్పుచేయాల్సిన ప‌రిస్థితులు లేవ‌న్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద‌ల‌కు ఉచితంగా వైద్యం అందించి ఆదుకున్న ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌దే అన్నారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా ఎంతో మంది పేద‌ల‌కు కార్పొరేట్ వైద్యంఅందిస్తున్నార‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌,  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు సుభాష్ చంద్ర‌బోస్‌, చింతా అనురాధ‌, ఎమ్మెల్యేలు జ‌గ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top