ప్రత్యేకహోదాకు వైయస్‌ఆర్‌సీపీకి కట్టుబడి ఉంది

చంద్రబాబు పాలనలో అవినీతిపై విచారణ జరిపిస్తాం

వెలగపూడి వ్యాఖ్యలకు మూల్యం చెల్లించక తప్పదు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌

విశాఖ జిల్లా: ప్రత్యేకహోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ కట్టుబడి ఉంటుందని వైయస్‌ఆర్‌సీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత తాజా ఫలితాలకు నిదర్శనమని తెలిపారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తారని పేర్కొన్నారు.ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విశాఖ కేంద్రంగా అన్ని డివిజన్‌లతో కూడిన జోన్‌ కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలంతా పోరాడతామన్నారు.చంద్రబాబులాగా మభ్యపెట్టే విధంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేయరని..సువర్ణపాలన  అందిస్తారని తెలిపారు.దేశంలోనే బీజేపీ,కాంగ్రెస్,డిఎంకే తర్వాత  22 మంది ఎంపీలు కలిగిన అతిపెద్ద పార్టీగా వైయస్‌ఆర్‌సీపీ అవతరించిందని తెలిపారు.రాష్ట్రంలో చంద్రబాబు పాలన జరిగిన అవినీతి మీద పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని  తెలిపారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని తెలిపారు.

Back to Top