రేపు పులివెందుల‌కు వైయ‌స్ జ‌గ‌న్‌

మూడు రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ సీఎం ప‌ర్య‌ట‌న‌

వైయ‌స్ఆర్ జిల్లా:  మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్ రెడ్డి రేపు(25వ తేదీ) నుంచి మూడు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. నవంబర్ 25 నుంచి 27 వరకు ఆయన నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు అధికారికంగా ప్రకటించారు.

➡️ 25-11-2025 షెడ్యూల్‌

రేపు సాయంత్రం 4 గంటలకు వైయ‌స్ జ‌గ‌న్‌ పులివెందుల చేరుకుంటారు. క్యాంప్ ఆఫీసుకు వెళ్లి రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ప్రజల నుంచి పలు సమస్యలు, వినతులను స్వీకరిస్తారు. అనంతరం పులివెందులలోని తన నివాసంలో రాత్రి బస చేస్తారు.

➡️ 26-11-2025 షెడ్యూల్‌

ఉదయం 9 గంటలకు పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్‌లో జరిగే వివాహానికి వైయ‌స్ జగన్ హాజరవుతారు.
తదుపరి బ్రహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి, అరటి రైతులతో అక్కడే మాట్లాడతారు. రైతుల సమస్యలు, ప్రస్తుత పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఆ తర్వాత పులివెందులకు తిరిగి వచ్చి లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు.
మధ్యాహ్నం వేల్పులలో లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్లి ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు.

సాయంత్రం పులివెందుల క్యాంప్ ఆఫీసుకు చేరుకుని మరోసారి రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి పులివెందుల నివాసంలోనే బస చేస్తారు.

➡️ 27-11-2025 షెడ్యూల్‌

ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనం కానున్నారు. 

Back to Top