వైయ‌స్ఆర్‌సీపీలో పలు విభాగాలకు నియామకాలు 

 
 తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలు విభాగాలకు నియామకాలు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది.
 
⇒ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ను పార్టీ రాష్ట్ర శెట్టి­బలిజ విభాగం అధ్యక్షుడిగా నియమించారు.
⇒ శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన     అంబటి శ్రీనివాసరావుకు రాష్ట్ర పోలినాటి వెలమ విభాగ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.  

⇒ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఎల్లా భాస్కర్‌­రావును రాష్ట్ర అతిరస విభాగ అధ్యక్షుడిగా నియమించారు.
⇒ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన పులిపాటి దుర్గారెడ్డికి పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు.
⇒ పల్నాడు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియో జకవర్గానికి చెందిన షేక్‌ దస్తగిరిని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

Back to Top