రైతులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు..

టీడీపీ పాలనలో రైతులకు అన్యాయం

రుణమాఫీ చేసినట్టుగా రైతులకు భ్రమ కల్పించారు

సీఎం వైయస్‌ జగన్‌ మాట నిలబెట్టుకునే వ్యక్తి

కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు

మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి:రుణమాఫీ చేస్తానని ఐదేళ్లయినా పూర్తి  చేయలేని గత ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతు సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు ధ్వజమెత్తారు.ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతు రుణమాఫీలో అనేక కోతలు పెట్టారు. రుణమాఫీ పూర్తిగా చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.
రుణమాఫీ మొత్తాన్ని ఖాతాల్లో వేసినట్టు రైతులకు భ్రమ కల్పించారని..ఎన్నికల ముందు అనేక జిమ్మికులు చంద్రబాబు చేశారని విమర్శించారు. చంద్రబాబు ప్రయత్నాల వల్ల రైతుల అనేక విధాలుగా దెబ్బతిన్నారని తెలిపారు. పౌర సరఫరాల శాఖ తెచ్చిన రుణాన్ని ఇతర అవసరాలకు కోసం మళ్లించారన్నారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసినా ఇంత వరుకు చెల్లించలేదని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాట ఇస్తే నిలబెట్టుకునే ముఖ్యమంత్రే గాని ఏదో విధంగా మసి పూసి మారేడు కాయ చేయాలనుకునే ముఖ్యమంత్రి కాదని తెలిపారు. చంద్రబాబు 2014లో ఏ విధమైన హామీ ఇచ్చారో..చివరకు రుణమాఫీని ఏవిధంగా మాఫీ చేశారో పరిశీలిస్తే కేవలం ఐదేళ్లలో  15,600 కోట్లు రూపాయలు  మాత్రమే రుణమాఫీ  చేశారని అంతకు మించి రైతులకు  ఏమి చేయలేదన్నారు. ఎన్నికల ముందు అన్నదాత సుఖీభవ,పసుపు–కుంకుమ అంటూ సొమ్ము అంతా మళ్లించి ఓట్ల కోసం ప్రయత్నం చేశారన్నారు. వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఒక వాస్తవం బయటపడిందని.. ధాన్యం కొనుగోలు కోసం, ఇతర అవసరాలు కోసం సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ 4,800 కోట్లు అప్పు తీసుకొచ్చిందని, ఆ సొమ్మును మళ్లించి వేరే అవసరాలకు వినియోగించారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం..గత మూడు నెలల నుంచి రైతుల వద్ద  కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ము  ఒక రూపాయి కూడా వారి ఖాతాల్లో వేయలేదన్నారు. పండించిన పంట అమ్ముకొంటే డబ్బులు వస్తాయని, అవసరాలు తీర్చుకోవాలని రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్నారన్నారు. రైతు కోసం తెచ్చిన సొమ్మును ప్రభుత్వం మళ్లించిందన్నారు. రైతుల కోసం రుణమాఫీ చేయని ప్రభుత్వం,రైతులకు ఇన్‌పుట్స్‌ సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని.. నేడు రైతుల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత సంవత్సరం 1800 కోట్లు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ రైతులకు టీడీపీ ప్రభుత్వం బకాయి పడింది.మొత్తం 2వేల కోట్ల ఇన్‌పుట్స్‌ సబ్సిడీ రైతులకు బకాయిపడిందన్నారు. కేబినెట్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 2వేల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటన చేశారని గుర్తుచేశారు. అన్నదాత సుఖిభవ రద్దు చేస్తారని..రైతులకిచ్చే డబ్బును ఆపేస్తారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని తప్పబట్టారు. రైతుల డబ్బును ఆపడంలేదని..రైతు భరోసా పథకాన్నిఅధికారంలోకి వచ్చిన రెండో సంవత్సరంలో అమలు చేస్తామని వైయస్‌ జగన్‌ ఎన్నికల ప్రణాళిక  భాగంగా ప్రకటించారని.. రైతులకు సకాలంలో ఆదుకోవడానికి పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ అక్టోబర్‌లోనే ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారన్నారు. చెప్పిన సమయం కన్నా ముందే అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు.రుణమాఫీ చేస్తానని ఐదేళ్ల పూర్తిఅయినా చేయలేని గత ముఖ్యమంత్రి చంద్రబాబు అని తెలిపారు.రైతులకు చేస్తానన్న 24వేల కోట్ల రుణమాఫీ చేయకుండా బాండ్లు ఇచ్చి.. చేతులు దులుపుకుని..ఎందుకు మళ్లీ అన్నదాత సుఖీభవ అని పెట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి సన్నద్ధం అయ్యారో సమాధానం చెప్పాలని టీడీపీని ప్రశ్నించారు. రైతులను మోసం చేయడానికి ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించారు.రైతులను,మహిళలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశ్యంతోనే చేశారని మండిపడ్డారు.  రైతుల ,సంక్షేమం గురించి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎవరో చెప్పవలసిన అవసరం రాదని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ అంటేనే రైతు సంక్షేమం గుర్తుకు వస్తుందన్నారు.రైతు,మహిళా సంక్షేమం మొదటి ప్రాధాన్యత అంశాలుగా  ఉంటాయని గతంలో సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారని గుర్తుచేశారు. రైతు భరోసా పథకాన్ని  కౌలు రైతులకు కూడా వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.15 లక్షల కౌలు రైతులకు రైతు భరోసా కింద 12,500 పెట్టుబడి సాయం కింద అందించడానికి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top