రాష్ట్ర దశదిశలను మార్చే 19 చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ట్వీట్‌  
 

అమరావతి : రాష్ట్ర దశదిశలను మార్చే 19 చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం తెలిపామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మహిళలు, రైతులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, పేద, మధ్య తరగతుల బాగోగులకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ తొలిబడ్జెట్‌ సమావేశాల్లోనే మెజార్టీ హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 14 రోజులపాటు కొనసాగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. 
 

Back to Top