రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు 

చంద్ర‌బాబుకు మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని పూజ‌లు

పూజ‌ల్లో పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

అమ‌రావ‌తి: అతి పవిత్రమైన శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలతో, దేవదేవుడికి ఆగ్రహం వచ్చి, దాన్ని రాష్ట్ర ప్రజలపై చూపకుండా, అది చంద్రబాబుకే పరిమితమయ్యేలా.. స్వామివారిని వేడుకుంటూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ నిర్దేశం మేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. 

శ్రీకాకుళం:
శ్రీకాకుళం లోని పిఎన్ కాలనీలోని నారాయణ తిరుమల ఆలయంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 

మాజీ ఉప ముఖ్యమంత్రి మంత్రి ధర్మాన కృష్ణ దాస్ కామెంట్స్

చంద్రబాబు లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని మాట్లాడడం  చాలా దురదృష్టకరం.
ప్రపంచ ప్రఖ్యాత గాంచిన వెంకటేశ్వరస్వామిని కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దురదృష్టకరం.
జగన్ మోహన్ రెడ్డిని కూడా తిరుపతి వెళ్తుంటే అడ్డుకోవడం దురదృష్టకరం.
రాష్ట్రంలో అరాచక పాలనకు ఇదే నిదర్శనం

ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం.

శ్రీకాకుళం.

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం రాజకీయ దుమారం రేపడంతో శ్రీకాకుళం జిల్లా పలాస ఉల్లాస పేట లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో  మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పాప పక్షాళన పూజలు చేశారు. 

మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. 
తిరుమల వెంకటేశ్వరస్వామి  ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం అసంబద్ధమైన వాదనను తెరపై తీసుకొచ్చారు. 
జంతువుల కొవ్వు తో తయారైన కల్తీ లడ్డూ  ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య  ప్రచారాలతో చంద్రబాబు భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు.
తిరుమల ప్రతిష్టకు  భంగం కలిగేలా ప్రవర్తించిన చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఆ వేంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించాం. 
ముఖ్య మంత్రి చేసిన పాపం ప్రజలకు అంటకూడదని  దేవుడికి క్షమాపణలు చెప్పుకున్నాం. 

వైయస్‌ జగన్ తిరుపతికి వెళ్తానంటే భయపడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.
వైయస్‌ జగన్ ఎన్నోసార్లు తిరుపతి వెలితే ఎప్పుడూ అవసరం లేని డిక్లరేషన్ ఈరోజు కావాలా...? 

పార్వతీపురం మన్యం జిల్లా 
పార్వతీపురం 

కోట్లాదిమంది భక్తుల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారు స్వయాన కొలువై ఉన్న  తిరుమల తిరుపతి దేవస్థానం వైభవాన్ని, స్వామి వారి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా చేయు అసత్య ప్రచారంతో తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి వారి విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు మాజీ సీఎం వైయస్ జగన్ గారు ఇచ్చిన పిలుపుమేరకు ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో గల బెలగాం లో కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు  ఆధ్వర్యంలో పాపప్రక్షాళన పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు  శత్రుచర్ల పరీక్ష రాజు హాజరయ్యారు.  

అల్లూరి సీతారామరాజు జిల్లా.
పాడేరు. 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రమైన పాడేరులో ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన పాడేరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజు, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు, పీఏసి మెంబర్ మాజీ ఎమ్మెల్యే పుట్టకొల్లి భాగ్యలక్ష్మి వైయస్ఆర్‌సీపీ శ్రేణులు.
 
ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు
 ఎంతో పవిత్రత కలిగిన తిరుమల పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు చెప్పారు. వందరోజుల పాలనను డైవర్ట్ చేసినందుకు తిరుమల లడ్డు అంశం కావాలనే తెరపైకి తెచ్చారని అన్నారు. 
 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని తిరుమల దర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజస్వామ్యం అన్నారు.
 చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవున్ని ప్రార్థించినట్లు ఆయన స్పష్టం చేశారు.

రాజానగరం,మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.
రాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ను అనుసరిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కోట్లాది ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం పై చంద్రబాబు అనవసర ఆరోపణ చేయటం తగదన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరలచటానికి లడ్డుపై ఆరోపణలు చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు వెంకన్న లడ్డును కూడా రాజకీయం చేయడం దారుణం అన్నారు. చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని రాజానగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించమన్నారు.

రాజమండ్రి, మాజీ ఎంపీ మార్గన భరత్.
ప్రపంచ ప్రసిద్ధమైన, హిందువులకు అత్యంత 
ప్రీతిపాత్రమైన  తిరుమల వెంకటేశ్వరుని లడ్డు ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలు చేయడానికి తీవ్రంగా మాజీ ఎంపీ మార్గాన భరత్ తీవ్రంగా ఖండించారు . కోట్లాదిమంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేయటం దారుణం అన్నారు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని, ఆయన చేసిన పాపాలు ప్రక్షాళన చేయాలని శ్రీ వెంకటేశ్వరని కోరుకుంటూ రాజమండ్రి కంబాల చెరువు సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోపూజలు నిర్వహించారు. 

పశ్చిమగోదావరి జిల్లా
చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డుపై చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు తాడేపల్లిగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.
మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కామెంట్స్:
రాష్ట్ర వ్యాప్తంగా తన స్వార్దానికి ఒక దౌర్భాగ్యుడు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి వారిని రాజకీయంగా వాడుకున్నారు.
100 రోజుల్లో చేసింది ఏమి లేదు. సిగ్గులేకుండా మంచి ప్రభుత్వం అంటూ స్టిక్కర్లు అంటిస్తున్నారు.

ప్రభుత్వంలో ప్రజలకి ఏమి చేయలేక దానిని కవర్ చేయడానికి ఆ భగవంతుడు మీద ప్రజలని డైవర్సన్ చేశారు.

స్వార్ధ రాజకీయాలు కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కోసం లడ్డు ప్రసాదం కలుషితం అయిందని దుర్మార్గపు రాజకీయానికి చంద్రబాబు తెరతీశాడు.
తిరుపతిలో పూర్తి స్థాయిలో చెకింగ్ అవ్వకుండా వస్తువును వినియోగించరు.
వెజిటబుల్ ఫ్యాట్ ఉందని రిపోర్ట్ లోస్వయంగా తిరుపతి దేవస్థానం ఈవో శ్యామల రావు నిర్దారించారు.
లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు వక్రీకరించారు.
వెంకటేశ్వర స్వామి నీవే చంద్రబాబుకి బుద్ధి వచ్చేలా చూడు స్వామి.అతను చేసిన దుర్మార్గపు చర్యకు బుద్ధి  వచ్చేలాగా ఆ దేవుడు చూడాలి.
మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా నాన్న దేవుడు దీపంతో సిగరెట్ వెలిగిస్తారని ఒకసారి, నేను క్రిస్టియన్ అని ఒకసారి, ముస్లిం అని ఒకసారి నోటికొచ్చినట్లుగా చెప్పే వ్యక్తి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య పిల్లలు తిరుపతి వెళ్లారు వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారా.

ఏలూరు.
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై చంద్రబాబు చేస్తున్న కుట్ల రాజకీయాలకు నిరసనగా తణుకులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కారుమూరి నాగేశ్వరావు, మాజీ మంత్రి.
చంద్రబాబు వేంకటేశ్వరస్వామిని  అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలకు తెర తీసాడని కారుమూరి నాగేశ్వరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ సీఎం అయ్యాక తిరుపతి ఆలయం అభివృద్ధికి కృషి చేశారని ఆయన తెలిపారు.పుష్కరాలు పేరు చెప్పి విజయవాడలో వందల సంఖ్యలో గుడులు కూల్చేసిన అప్రతిష్ట చంద్రబాబుదనీ ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ,ఇతర దేశాల్లోనూ  కూడా గుడులు నిర్మించిన ఘనత జగన్ ది అని తెలిపారు.శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన చంద్రబాబుని స్వామి వారు శిక్షిస్తారనీ స్పష్టం చేశారు. 

విజయవాడ 
*తిరుమల పవిత్రతను,శ్రీవారి ప్రసాదం విశిష్టతను,టీటీడీ పేరు ప్రఖ్యాతలను మంటగలిపిన చంద్రబాబు పాపాల ప్రక్షాళన కోసం 
వన్ టౌన్ లో వైసీపీ ప్రత్యేక పూజలు*
 వన్ టౌన్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన విజయవాడ వెస్ట్ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి వెలంపల్లి శ్రీనివాసరావు.
 
పూజల్లో పాల్గొన్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పోతిన మహేష్, ఎమ్మెల్సీ రుహుల్లా ,వైసీపీ కార్పొరేటర్లు,కార్యకర్తలు.

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్‌
గత కొద్ది రోజుల నుంచి చంద్రబాబు అనేక ప్రచారాలు చేస్తున్నారు. 
తిరుపతి లడ్డూ పవిత్రతను, ఆలయ పవిత్రతను స్వయంగా సీఎం చంద్రబాబే తగ్గించడం దుర్మార్గం.
పార్టీ మీటింగ్ లో తిరుమల విశిష్టతను తగ్గించేలా మాట్లాడటం బాధాకరం. 
జూన్ 12 వ తేదీన మంచి నెయ్యి వాడుతున్నామని ఈవో శ్యామలరావు చెప్పారు
చంద్రబాబేమో...జంతువుల  కొవ్వు కలిపారని చెబుతున్నాడు

చంద్రబాబు నిజంగా  వేంకటేశ్వరస్వామిని పూజించే వ్యక్తి అయితే ఇలాంటి అసత్య ప్రచారం చేయడు.

ప్రతిపక్షనాయకుడిగా...సీఎంగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అనేకమార్లు తిరుపతి వెళ్లారు
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు
అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడెందుకు
హిందువుల మనోభావాలను...తిరుపతి ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారు
చంద్రబాబుకు మంచి బుద్ధిని ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నాం.

కర్నూలు జిల్లా.
తిరుమల లడ్డులో కల్తీ జరిగినట్టుగా అసత్య ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు  కల్లూరు అర్బన్ కృష్ణ నగర్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో  పూజలు చేపట్టిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , పాణ్యం నియోజకవర్గం లోని వైసిపి నాయకులు , కార్యకర్తలు
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కామెంట్స్...

చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు.
చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా చిల్లర రాజకీయాలు..
ప్రజలను డైవర్ట్ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డు విషయాన్ని రాజకీయ చేస్తున్నారు.
అన్ని మతస్థులను మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గౌరవిస్తున్నారు.
చంద్రబాబు పరమనీచుడు,  రాష్ట్రంలో దేవుడిని అడ్డుపెట్టుకోని రాజకీయాలు చేస్తు  తెలివి తక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాజకీయాల్లో దేవుడిని చంద్రబాబు లాగి ప్రజలను మభ్యపెడుతున్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామిలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి  దీనిపై బాబుకు ప్రజలకు బుధ్ధి చెబుతారు.

అన్నమయ్య జిల్లా 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి లో వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం, పూజలు, అర్చనలు. 
తిరుమల లడ్డుపై అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు కు మంచి భుద్ది ప్రసాదించాలని టెంకాయలు కోట్టిన వైఎస్ఆర్ సిపి శ్రేణులు.
వైయస్ఆర్‌సీపీ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో మాన్నూరు ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు, అర్చనలు...
తిరుమల మహా ప్రసాదం పై వక్రబుద్ధితో అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఆపద కలగకూడదని ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి...

గుంటూరు:
గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని మణి హోటల్ సెంటర్ లో తిరుమల లడ్డు ప్రసాదాన్ని చంద్రబాబు నాయుడు అపవిత్రం చేసినందుకు ఆయన పాపాన్ని ప్రక్షాళన చేయాలంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈస్ట్ నియోజకవర్గ కన్వీనర్ నూరి ఫాతిమా
అంబటి రాంబాబు, మాజీ మంత్రి.
వైయస్ఆర్‌సీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేశాం.
ఈ రాష్ట్ర సిఎం తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని అసత్య ప్రచారం చేస్తున్నారు 
ఆ పాపం ప్రజలకు అంటకూడదని వెంకటేశ్వర స్వామి ని పూజించాం.
మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కామెంట్స్
ఏకత్వంలో భిన్నత్వం ఉన్న దేశం ఇది.
జగన్ ను అంటరాని వాడిగా కూటమి ప్రభుత్వం చూస్తుంది.
ఈ రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తుంది.
సెక్యులర్ అన్న పదం రాజ్యాంగం ప్రియాంబుల్ లో ఉంది.
మీము ఇతర దేశాలకు చెందిన వారామా...
హిందువుల్లో పుట్టినా ఇతర మతస్థులను గౌరవిస్తాం
లడ్డూ ప్రసాదం కల్తీ పై సిబిఐ విచారణ జరిపించాలి.
పవన్ కళ్యాణ్ ప్రవర్తన చూస్తే బాధాకరంగా ఉంది.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొరిటిపాడు సెంటర్లోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన చంద్రబాబు పాపానికి ప్రక్షాళన జరగాలని కోరుతూ పూజలు నిర్వహించిన మాజీ మంత్రి విడదల రజిని, అంబటి రాంబాబు, చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
మాజీ మంత్రివిడదల రజిని కామెంట్స్
కూటమి ప్రభుత్వం రాజకీయాలను ప్రజలను గమనిస్తున్నారు 
వంద రోజులు పాలనలో ఏంచేయలేకపోయారు.
ప్రక్కదారి పట్టించేందుకు అపవిత్రం అంటూ ప్రచారాలు చేస్తున్నారు.
సమాజానికి ఇటువంటి ప్రచారం మంచిది కాదు.

అనంతపురం:
శ్రీకంఠం సర్కిల్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయం లో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, చంద్రబాబు పాపం ప్రజలపై పడకూడదని స్వామి వారికి పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, అనంతపురం దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, అహుడా మాజీ ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్

వైయస్ఆర్ జిల్లా:

చంద్రబాబు పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి  కామెంట్స్
 బొల్లవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రేత్యేక పూజల చేసిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 
హిందూ ధర్మం మతం గురించి తెలియని బాబు, బూట్లు వేసుకొని స్వామి వారి పటం చేతపట్టారు
బాబు నైజం అబద్ధాలు చెప్పటం, ఇచ్చిన మాట తప్పటం, అధికారం కోసం అడ్డదారులు నేడు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు మాంసం అంటూ ప్రజలను నమ్మిస్తున్నారు
ల్యాబ్ రిపోర్ట్ నందు 5 ప్రమానికాల ద్వారా నాణ్యత ప్రమాణాలు కొలతలు వుంటాయి అని ఇచ్చారు
ఆవు నెయ్యి లో నాణ్యత లోపించింది, అనారోగ్యం వల్ల, ఫీడ్ లో మార్పుల చేతనే నెయ్యిలో మార్పులు, నాణ్యత మాత్రమే లోపించింది
వైయ‌స్ జగన్ తిరుమల పర్యటనకు అడ్డు పడ్డారు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వున్న వైసిపి నాయకులకు పోలీసుల నోటీసులు ఇచ్చారు, ఇది అరాచక ప్రభుత్వం

పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు....  ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద నామస్పనలతో మారుమోగిన శ్రీనివాసుని ఆలయాలు...

పులివెందుల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వైయస్ మనోహర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...

తిరుమల తొలిగడప దేవుని కడప లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేసిన వైయస్ఆర్‌సీపీ శ్రేణులు
పి. రవీంద్రనాథ్ రెడ్డి... జిల్లా అధ్యక్షుడు...
మానవత్వం నా మతం అని వైయస్ జగన్ ఎన్నోసార్లు చెప్పారు...
దేవుడి విషయంలో రాజకీయాలు చేయడం చంద్రబాబు అలవాటే...
తిరుమల లడ్డు విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారు..
తిరుమలకు వస్తున్న వైయస్ జగన్ కు అనేక ఆంక్షలు పెట్టారు..
అనేక మంది వైయస్ఆర్‌సీపీ శ్రేణులకు నోటీసులు ఇచ్చి వెళ్లొద్దంటూ హెచ్చరించారు 
అడుగడుగునా వైయస్ జగన్ ను అవమానిస్తూనే ఉన్నారు..
చంద్రబాబు చేస్తున్న అరాచకాలు ప్రజల గమనిస్తూనే ఉన్నారు...

నెల్లూరు.
నగరంలోని మాగుంట లేఔట్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త పూజా కార్యక్రమాలు నిర్వహించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఇంచార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి..
రూరల్ ఇంచార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి
- కల్తీ నెయ్యితో తిరుమల అడ్డు తయారు చేశారంటూ చంద్రబాబు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేశారు..
- చంద్రబాబు అసత్య ప్రచారంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి..
- లడ్డులో  కల్తీ నెయ్యి లేదంటూ సాక్షాత్తు టీటీడీ ఈవో శ్యామల రావే చెప్పారు..
- చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్త పూజా కార్యక్రమాలు చేస్తున్నాం..
- సామాన్య భక్తునిగా దర్శనానికి వెళ్తుంటే జగన్ ని అడ్డుకోవడం అత్యంత దుర్మార్గం..
- ఈ పాపాలకు చంద్రబాబు భవిష్యత్తులో తప్పకుండా శిక్ష అనుభవిస్తారు..
మాజీ ఎంపీ ఆదాల కామెంట్స్.
- చంద్రబాబు నోటి వెంట వచ్చేవన్నీ అబద్ధాలే..
- తిరుమల లడ్డు వ్యవహారాన్ని కావాలనే ఆయన రాజకీయం చేస్తున్నారు..
- నిజా నిజాలు ప్రజలకు తెలియజేసేందుకు న్యాయవిచారణ జరపాలి..
చిత్తూరు జిల్లా 
తిరుమల మహా ప్రసాదం లడ్డుపై అసత్య ఆరోపణలు ఖండిస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర్ నెల్లూరు వైయస్ఆర్‌సీపీ ఇన్చార్జి కృపా లక్ష్మి పిలుపుమేరకు  శ్రీరంగారాజపురం మండల జడ్పిటిసి ప్రసాద్ రెడ్డి, మండల అధ్యక్షులు మనీ, ఎంపీపీ సరిత జనార్ధన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ ఆరిమని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నంద్యాల జిల్లా.
డోన్ లో మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్  ఆధ్వర్యంలో మధు ఫంక్షన్ హాల్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వరకు పాదయాత్ర ...
రాష్ట్రంలో తిరుమల లడ్డుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ...
ప్రకాశం జిల్లా.
ఓంగోలు పార్లమెంట్ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్
కలియుగ ప్రత్యక్ష దైవం  వేంకటేశ్వర స్వామి లడ్డునప్రసాదం పై దుష్ప్రచారం అనైతికం . వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర కు ముందు పాదయాత్ర ముగింపు వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు
దేశ వ్యాప్తంగా వందలాది వెంకటేశ్వర స్వామి  గుడులు కట్టించారు
వైయస్ఆర్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు 5 సార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు
ఆయన కొడుకుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి గా శ్రీవారి కి పట్టు వస్త్రాలు సమర్పించారు
చంద్రబాబు దేవుడి ని కూడా రాజకీయాల్లోకి లాకి నీచ రాజకీయాలు చేస్తున్నాడు
దేవుడి గురించి ఎక్కువగా మాట్లాడ కూడదనే అందరం స్పందించడం లేదు
తిరుపతి జిల్లా
అంజేరమ్మ కనుమ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గం ఇన్చార్జి కృపాలక్ష్మి 

నారాయణ స్వామి, మాజీ డిప్యూటీ సిఎం కామెంట్స్.
చంద్రబాబు నాయుడు దేవుడు ప్రసాదం తో రాజకీయాలు మానుకోవాలి
చంద్రబాబు కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అమ్మవారిని పూజలు చేశాం
తిరుమల శ్రీవారి కి ముఖ్యమంత్రి హోదాలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పట్టు వస్త్రాలు అందించే అదృష్టం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం కే దక్కింది
చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు,ప్రజలే తగిన బుద్ధి. చెబుతారు
ఒక మాజీ ముఖ్యమంత్రి నీ తిరుమల శ్రీవారు దర్శనం కు రానివ్వకుండా అడ్డుకున్నారు అంటే  మీప్రభుత్వంలో ఇక దళితులకు ఏం రక్షణ ఉంటుంది
ఇప్పటికే దళితులకు చాలా చోట్ల గ్రామాల్లో దేవలయల్లోకి అనుమతిలేదు.
చంద్రబాబు నిన్న జరిగిన సంఘటనతో కుల,మతోన్మాద శక్తులు మరింత రెచ్చిపోతారు
చంద్రబాబు కు మంచి బుద్ధి ప్రసాదించాలని అంజేరమ్మ తల్లి ను కోరాను.

Back to Top