అమరావతి: రాష్ట్రంలో రైతుల సమస్యపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట పట్టింది. అందులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో రైతులు కదం తొక్కారు. పార్టీ శ్రేణులు కూడా ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ధాన్యం సేకరణలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయడంతో పాటు, కనీస మద్ధతు ధర కల్పించాలని, పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు వెంటనే ఇవ్వాలని, గత ప్రభుత్వ హయాంలో పక్కాగా అమలైన ఉచిత పంటల బీమాను యథాతథంగా ఇప్పుడు కూడా రైతులకు వర్తింప జేయాలన్న డిమాండ్లతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించే కార్యక్రమం చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించి, తమ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులతో కలిసి పార్టీ నాయకులు జిల్లా అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. జిల్లాల వారీగా రైతుపోరు కార్యక్రమం: శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే పార్క్ నుంచి కలెక్టర్ కార్యాలయం ర్యాలీ చేసిన వైయస్ఆర్ సీపీ నేతలు, నాయకులు, రైతులతో కలిసి అనంతరం జాయింట్ కలెక్టర్ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం సమర్పించారు. పార్టీ సమన్వయకర్తలు పిరియా విజయ్ (ఇచ్ఛాపురం), డాక్టర్ సీదిరి అప్పలరాజు (పలాస), రెడ్డి శాంతి (పాతపట్నం), చింతాడ రవి (ఆముదాలవలస), ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట), గొర్లి కిరణ్‌కుమార్ (ఎచ్చెర్ల)తో పాటు, పార్టీ నేత పేడాడ తిలక్, ఇంకా దాదాపు 400 మంది హాజరు. పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం జిల్లాలో ఐటీడీఏ పెట్రోల్ బంకు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ శోభకకు వినతిపత్రం సమర్పించిన వైయస్సార్సీపీ నేతలు. నిరసన కార్యక్రమానికి 200 మంది హాజరయ్యారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పి.పుష్పశ్రీవాణి (కురుపాం), పీడిక రాజన్నదొర (సాలూరు), అలజంగి జోగారావు (పార్వతీపురం), వి.కళావతి (పాలకొండ), పాలవలస విక్రాంత్ (ఎమ్మెల్సీ), తనూజ (అరకు ఎంపీ), శత్రుచర్ల పరీక్షిత్ రాజు (పార్టీ జిల్లా అధ్యక్షుడు) హాజరు. విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లాలో వైయస్ఆర్ సీపీ నేతలు కంటోన్మెంట్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, జాయింట్ కలెక్టర్ శేతు మాధవన్ కు వినతిపత్రం సమర్పించారు. విజయనగరం జిల్లా నియోజకవర్గం నుంచి హాజరైన నేతలు. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జీలు.. మజ్జి శ్రీనివాసరావు(జిల్లా పరిషత్ చైర్మన్), శంబంగి వెంకట చినఅప్పలనాయుడు (బొబ్బిలి), బొత్స అప్పలనర్సయ్య (గజపతినగరం), తలే రాజేష్ (రాజాం), కోలగట్ల వీరభద్రస్వామి (విజయనగరం), బడ్డుకొండ అప్పలనాయుడు (నెల్లిమర్ల), కడుబండి శ్రీనివాసరావు (ఎస్.కోట).. ఇంకా జీసీసీ మాజీ ఛైర్‌పర్సన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్సీ డాక్టర్ పెన్మత్స సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు), విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు, 2 వేల మంది హాజరయ్యారు. విశాఖపట్నం జిల్లా: విశాఖపట్నం జిల్లాలో వైయస్ఆర్ సీపీ నేతలు జడ్పీ జంక్షన్ కృష్ణ మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీఆర్వో భవానీశంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. అన్నదాతకు అండగా కార్యక్రమానికి సుమారు 700 మంది ప్రజలు హాజరు. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నేతలు.. గుడివాడ అమర్‌నాథ్ (గాజువాక), వాసుపల్లి గణేష్‌కుమార్ (విశాఖ సౌత్), మల్లా విజయప్రసాద్ (విశాఖ వెస్ట్), ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాలో వైయస్ఆర్ సీపీ నేతలు రైల్వేస్టేషన్ సమీపంలో వైయస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ మేడిద జాహ్నవికి వినతిపత్రం సమర్పించారు. అన్నదాతకు అండగా కార్యక్రమానికి సుమారు 700 మంది ప్రజలు హాజరు. ఇంకా నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు.. బూడి ముత్యాలనాయుడు (మాడుగుల), కరణం ధర్మశ్రీ (చోడవరం), అన్నంరెడ్డి అదీప్‌రాజ్ (పెందుర్తి), కన్నబాబు రాజు (యలమంచిలి), కంబాల జోగులు (పాయకరావుపేట)ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సినిమాహాల్ సెంటర్ వైయస్ఆర్ సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి.. డీఆర్వో పద్మలతకు వినతిపత్రం సమర్పించారు. ఇందులో రేగ మత్స్యలింగం (అరకు ఎమ్మెల్యే), గొట్టేటి మాధవి (అరకు మాజీ ఎంపీ), రవిబాబు (ఎమ్మెల్సీ), జల్లి సుభద్ర (జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్), కొట్టుగుళ్లు భాగ్యలక్ష్మి (పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షురాలు)తో పాటు, దాదాపు 800 మంది హాజరయ్యారు. కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లాలో అన్నదాతకు అండగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయం కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్‌కు వినతిపత్రం సమర్పించారు. అన్నదాతకు అండగా నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్), దాడిశెట్టి రాజా (తుని), ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ సిటీ), వంగా గీత (పిఠాపురం), దవులూరి దొరబాబు (పెద్దాపురం)తో పాటు, పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. ఇంకా అల్లూరి సీతారామరాజు జిల్లా తరపున మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ కాకినాడలో ర్యాలీ కార్యక్రమానికి హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా: అన్నదాతకు అండగా కార్యక్రమంలో రాజమండ్రిలో బొమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, డీఆర్వో సీతారామమూర్తికి వినతిపత్రం సమర్పించారు. దాదాపు 700 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా పార్టీ నేతలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు), మార్గాని భరత్ (పార్టీ రాజమండ్రి సమన్వయకర్త), జక్కంపూడి రాజా (రాజానగరం), డాక్టర్ సూర్యనారాయణరెడ్డి (అనపర్తి), తానేటి వనిత (గోపాలపురం), తలారి వెంకట్రావు (కొవ్వూరు), డాక్టర్ గూడూరు శ్రీనివాస్ (పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్త) ఇంకా పార్టీ నేత జక్కంపూడి విజయలక్ష్మి హాజరు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లాలో అమలాపురం నల్లవంతెన నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డీఆర్వో మదన్‌మోహనరావుకు వినతిపత్రం సమర్పించారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, గొల్లపల్లి సూర్యారావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు విప్పర్తి వేణు గోపాల్, పిల్లి సూర్యప్రకాష్. తోట త్రిమూర్తులుతో పాటు, దాదాపు 750 మంది కార్యక్రమానికి హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విస్తా కోడూరు రోడ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డీఆర్వో మొగలి వెంకటేశ్వరరావుకి వినతిపత్రం సమర్పించిన వైయస్సార్సీపీ నేతలు. భీమవరంలో అన్నదాతకు అండగా వైయస్సార్ సీపీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాస్, గూడూరు ఉమాబాల (నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్)తో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు దాదాపు 1000 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా: ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం డీఆర్వో విశ్వేశ్వరరావుకి వినతిపత్రం సమర్పించిన వైయస్ఆర్ సీపీ నేతలు. అన్నదాతకు అండగా కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ కన్వీనర్ సునీల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు.. వాసు బాబు, బాలరాజు, మేక వెంకటప్రతాప్‌అప్పారావు, పార్టీ నియోజకవర్గాల కన్వీనర్లు విజయరాజు, జయప్రకాష్‌తో పాటు, దాదాపు 350 మంది హాజరు. ఎన్టీఆర్ జిల్లా: అన్నదాతకు అండగా వైయస్ఆర్ సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి బయలుదేరిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అనినాష్ సహా, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు, పార్టీ నేతలు ఆసిఫ్, ఇంటూరి చిన్న, విజిత, చైతన్యరెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, డిప్యూటీ మేయర్లు అవుతూ శైలజారెడ్డి, బెల్లం దుర్గతో పాటు, పలువురు కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో అన్నదాతలకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాచౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఇన్ ఛార్జి డీఆర్వో శ్రీదేవికి వినతిపత్రం సమర్పించారు. దాదాపు 500 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంకా పార్టీ నేతలు సింహాద్రి రమేష్ (అవనిగడ్డ), కైలే అనిల్‌కుమార్ (పామర్రు), ఉప్పాల రాము (పెడన), దేవభక్తుని చక్రవర్తి (పెనమలూరు) తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. గుంటూరు జిల్లా: గుంటూరులో ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించి, జేసీకి వినతిపత్రం అందజేసిన వైయస్ఆర్‌సీపీనేతలు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్ షేక్‌నూరి ఫాతిమా, తాడికొండ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త డైమండ్ బాబు హాజరయ్యారు పల్నాడు జిల్లా: నరసరావుపేటలో కదం తొక్కిన రైతులు. అన్నదాతకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న రైతులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ. ర్యాలీలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, నంబూరు శంకర్రావు. బాపట్ల జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులతో భారీ ర్యాలీ. వినతిపత్రం సమర్పణ. ర్యాలీలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, నియోజకవర్గ కన్వీనర్లు వరికూటి అశోక్ బాబు, ఈవూరి గణేష్, హనిమిరెడ్డి. ప్రకాశం జిల్లా: అంబేడ్కర్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ. వినతి పత్రం సమర్పణ. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లు. ఇంకా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ ఒంగోలు ఇన్‌ఛార్జి చుండూరు రవి, మార్కాపురం ఇంఛార్జ్ అన్నా రాంబాబు, గిద్దలూరు ఇన్‌ఛార్జ్ కె.నాగార్జునరెడ్డి, కనిగిరి ఇన్‌ఛార్జ్, ఇంఛార్జి నారాయణయాదవ్ , మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారుడు జూపూడి ప్రభాకర్, లిడ్ క్యాప్ మాజీ చైర్మెన్ కాకుమాను రాజశేఖర్, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకారావు మాదిగ, రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి, పిడిసిసి బ్యాంక్ మాజీ ఛైర్మెన్ బన్ని, పట్టణ అధ్యక్షులు శంకర్. నెల్లూరు జిల్లా: వీఆర్సీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాతలకు అండగా వైయస్ఆర్‌సీపీ ర్యాలీని నిర్వహించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. హాజరైన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పార్టీ రూరల్ నియోజకవర్గం ఇన్‌చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు. తిరుపతి జిల్లా: తిరుపతి కలెక్టరేట్‌లో రైతుల పక్షాన వినతి పత్రాన్ని డీఆర్వో నరసింహులుకు అందించిన భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ డిప్యూటి సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అభినయ్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సత్యవేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఇంచార్జీ రాజేష్, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. కర్నూలు జిల్లా: కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ. పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, శ్రీదేవితో పాటు, పార్టీ నాయకులు బుట్టా రేణుక, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్థన్‌రెడ్డి. నంద్యాల జిల్లా: మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, భూమా కిషోర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ మాజీ ఛైర్మన్ పిపి నాగిరెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్యనారాయణరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ మాజీ చైర్మన్ శశికళరెడ్డి, నంద్యాల మున్సిపల్ ఛైర్మన్ మాబున్నిసా తదితరులు ర్యాలీగా వచ్చి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లా: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా వైయస్ఆర్‌సీపీ భారీ ర్యాలీ. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి , కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎమ్మెల్సీలు మంగమ్మ, వై.శివరామిరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, శింగనమల సమన్వయకర్త వీరాంజనేయులు, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, గుంతకల్లు మునిసిపల్ వైస్ చైర్మన్ నైరుతి రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా: రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పుట్టపర్తి లో వైయస్ఆర్‌సీపీ భారీ ర్యాలీ. సత్యసాయి జిల్లాలోని వైయస్సార్ పార్టీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు రైతులకు మద్దతు ధర కల్పించాలని ర్యాలీగా వెళ్ళిన వైఎస్‌ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అనంతరం జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. పార్టీ నేతలు, మాజీ మంత్రులు శంకర్‌నారాయణ, ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు, హిందూపురం సమన్వయకర్త దీపిక, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, కదిరి సమన్వయకర్త మక్భుల్ హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా: అనమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్ళి జేసీకి వినతిపత్రం అందజేసిన జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు అకే పాటి అమరనాధ్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, కోరముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె ఇన్‌ఛార్జ్ నిస్సార్ అహ్మద్. వైయస్ఆర్ జిల్లా: కడప వైయస్ఆర్‌సీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి జేసీకి వినతిపత్రం అందజేసిన వైయస్ఆర్‌సీపీ నేతలు రవీంద్రనాధ్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, డాక్టర్ సుధీర్, రఘురామిరెడ్డి, దాసరి సుధ, అంజాద్ బాషా, సురేష్ బాబు, రామాంజులరెడ్డి, గోవిందరెడ్డి, రామసుబ్బారెడ్డి. చిత్తూరు జిల్లా: రైతుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌కు ర్యాలీ. టీవీకేఎన్ కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేత. భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, నాయకులు. ర్యాలీలో పాల్గొన్న పార్టీ జిల్లా నేతలు విజయానందరెడ్డి, భరత్, కృపాలక్ష్మి, వెంకటేశ్‌గౌడ తదితరులు.