ఎల్లో మీడియా ఏడుపు

వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్‌పై విష ప్ర‌చారం

ప్ర‌పంచ బ్యాంకు రుణం వెన‌క్కిపోయింద‌ని త‌ప్పుడు క‌థ‌నాలు 

పెద్ద కంపెనీలు వెన‌క్కి పోతున్నాయ‌ని పిచ్చి రాత‌లు

అమ‌రావ‌తి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొన్ని మీడియా సంస్థలు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి  మంచి పేరు రావ‌డంతో స‌హించ‌లేక‌పోతున్నాయి.  చంద్రబాబు నాయుడికి అనుకూల మీడియా మళ్లీ  పల్లకి సేవ ప్రారంభించింది.  ప్ర‌పంచ బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు నిరాక‌రించింద‌ని కొత్త రాగాన్ని అందుకుంది.   పెద్ద కంపెనీల‌న్నీ రాష్ట్రాన్ని వ‌దిలి పోతున్నాయి అంటూ గ‌గ్గోలు పెడుతున్నాయి.
ఎల్లో మీడియా ఏడుపుల‌కు స‌మాధాన‌మిదిగో..:
ప్ర‌పంచ‌బ్యాంక్ వెన‌క్కు పోయింది రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాజెక్ట్ కు రుణం ఇవ్వ‌డం  లేద‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తోంది. 
దానికి రెండు కార‌ణాలు. 
ఒక‌టి రాజ‌ధాని భూసేక‌ర‌ణ‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల గురించి ఆ ప్రాంత రైతులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఫిర్యాదులు చేయ‌డం.
కేంద్రం ఏపీ రాజ‌ధానికి ఇచ్చిన ఆర్థిక ప‌ర‌మైన అనుమ‌తుల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌పంచ బ్యాంకుకు తెలియ‌జేయ‌డం. 
ఇక ఏఐబిబి రాజ‌ధాని కోసం రూ.1400 కోట్ల రుణం ఇస్తానంది. ప్రపంచ బ్యాంకు రాజ‌ధాని ప్రాజెక్టులో అవ‌క‌త‌వ‌క‌లున్నాయ‌ని తెలుసుకుని వైదొల‌గింది క‌నుకే ఏఐబీబీ కూడా త‌ప్పుకుంది
ఎగ్జిమ్ బ్యాంకు విశాఖ మెట్రో ప్రాజెక్టుకు రుణం ఇస్తాన‌న్న‌ది. కానీ ఇది కూడా అమ‌రావ‌తి స‌స్టైన‌బుల్ ఇన్ఫ్రా స్ట్ర‌క్చ‌ర్ అండ్ ఇనిస్టిట్యూష‌న‌ల్ డెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్ట్ లో ఒక భాగ‌మే. 
అంటే రాజ‌ధాని ప్రాజెక్టు విష‌యంలో అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న బ్యాంకుల‌న్నీ రుణం ఇచ్చేందుకు నిరాక‌రిస్తున్నాయ‌న్న‌మాట‌. 
ఇక విశాఖ ఐబిఎమ్ లో ఉద్యోగాలు పోతున్నాయంటూ మ‌రో ప‌చ్చ ప్రచారాన్ని తెర‌పైకి తెచ్చారు. ఐటీ రంగంలో అవ‌సరం మేర‌కు ఉద్యోగాల‌ను త‌గ్గించుకోవ‌డం ఎప్ప‌టి నుంచో ఉంది. చంద్ర‌బాబు హ‌యాంలో వ‌చ్చిన అతి కొద్ది కంపెనీలు కోట్ల విలువైన భూముల‌నైతే హ‌స్త‌గ‌తం చేసుకున్నాయి కానీ ఇస్తామ‌న్న వేలాది ఉద్యోగాలు ఇవ్వ‌నేలేదు. క‌న్ని కంపెనీలు త‌మ కార్య‌క‌లాపాలు కూడా ఇంత‌వ‌ర‌కూ ప్రారంభించ‌లేదు. ఇక ఐటీ సెక్టార్ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వ చేసిన కేటాయింపులు, పెట్టిన ఖ‌ర్చు అతి స్వ‌ల్పం అన్న విష‌యాన్ని ఆర్థిక‌మంత్రి సాక్ష్యాల‌తో స‌హా శాస‌న స‌భ‌లో వివ‌రిస్తే తెలుగుదేశం స‌భ్యులు మిన్న‌కుండిపోయారు. 
ఇప్పుడు ఆలోచించండి. విదేశీ బ్యాంకులు రుణాలు ఇవ్వ‌క‌పోవ‌డంలో కొత్త ప్ర‌భుత్వం జోక్యం ఏముంది?
ఐటీ రంగానికి ఏమీ చేయ‌కున్నా ఐటీ కంపెనీలు, ఉద్యోగాలు రావ‌డం లేదంటూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పై నెపం వేయ‌డం ఎందుకు?
కేవ‌లం వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో అపోహ‌లు పెంచాల‌ని టీడీపీ చేస్తున్న దారుణ‌మైన ప్ర‌చారం ఇది. 

అస‌లు క‌థ 
అమ‌రావ‌తి కోసం జ‌రిగిన భూసేక‌ర‌ణ‌పై, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులపై ఉన్న అభ్యంత‌రాలు ప‌రిశీలించేందుకు వ‌ల్డ్ బ్యాంక్ ఇప్ప‌టికే ప‌లుసార్లు ఏపీలో ప‌ర్య‌టించి ప‌రిశీల‌న చేసింది. టీడీపీ ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ విష‌యంలోనే కాక కాంట్రాక్టుల విష‌యంలోనూ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డింద‌న్న విష‌యాన్ని నిర్థారించుకుంది. తాను ఇస్తాన‌న్న 300 మిలియ‌న్ డాల‌ర్ల రుణాన్ని వాయిదా వేసుకుంటూ వ‌చ్చింది. 
ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యాక రాజ‌ధాని భూముల విష‌యంలో కొత్త ప్ర‌భుత్వ విధానాల గురించి ప్ర‌శ్నించింది. ప్ర‌పంచ బ్యాంకు రుణ అనుమ‌తి కోసం రాష్ట్ర ప‌రిపాల‌నా వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌డాన్ని స‌మ‌ర్థించ‌ని కేంద్రం ఈ వ్య‌వ‌హారాన్ని క‌ట్ట‌డి చేసింది. 
దాంతో అమ‌రావ‌తి ప్రాజెక్టులో ప్ర‌పంచ బ్యాంకు రుణం ఇవ్వ‌న‌ని స్ప‌ష్టం చేసింది. అంటే ఇప్ప‌టి వ‌ర‌కూ వైదొల‌గుతున్న బ్యాంకులు అని టీడీపీ గొడ‌వ చేసేది అప్పుల గురించి మాత్ర‌మే. 

ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లి వ‌స్తున్నాయి
అయితే కొత్త ప్ర‌భుత్వం కోరితే మౌలిక వ‌స‌తుల కోసం అంత‌కంటే ఎక్కువ రుణ మంజూరు చేసేందుకు వ‌ల్డ్ బ్యాంకు సుముఖ‌త వ్య‌క్తం చేసింది. 
ఇప్ప‌టికే ఆరోగ్య రంగానికి 328 మిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక సాయం అందించే విష‌యంలో ఒప్పందాల‌పూ సంత‌కాలు కూడా చేసింది ప్ర‌పంచ బ్యాంక్. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నెల రోజుల్లోపే ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా, సింగ‌పూర్, చైనా ప్ర‌తినిధులు రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు పెట్టేందుకు క్యూ క‌డుతున్నారు. చంద్ర‌బాబులా వైఎస్ జ‌గ‌న్ ఏ దేశానికీ వెళ్ల‌లేదు. అయినా స‌రే అమెరికా రాయ‌బారి స్వ‌యంగా వ‌చ్చి ఏపీ మంత్రుల‌ను క‌లిసి చ‌ర్చించి వెళ్లింది. రాజ‌ధాని ప్రాజెక్టు నుండి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ ఏపీ అభివృద్ధి విష‌యంలో స‌హ‌క‌రిస్తామ‌ని ప్ర‌పంచ బ్యాంకు స్వ‌యంగా ముఖ్య‌మంత్రికి లేఖ రాసింది. ఆరోగ్యం, వ్య‌వ‌సాయం,ఇంధ‌నం, విప‌త్తు నిర్వ‌హ‌ణా రంగాల్లో భారీగా ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలియ‌జేసింది. చంద్ర‌బాబులా మాట‌ల్లో కాదు చేత‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్ అభివృద్ధిని చేసి చూపుతున్నారు. అస‌లైన పాల‌న‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నారు.

Back to Top