చిన్నారులకు నేటి నుంచి విటమిన్ 'ఏ' సిరప్ 

 రేచీకటి బారిన పడకుండా చర్యలు 
 

అమ‌రావ‌తి: చిన్నారులు రేచీకటి బారిన పడకుండా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ‌ మరో పథకాన్ని నేటి నుంచి శ్రీ‌కారం చుట్టింది.  ఈ నెల 31 వరకూ అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్ ఏ సప్లిమెంటరీ సిరప్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. "అక్టోబర్ 13 వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం 5 సం.ల లోపు పిల్లలందరికీ విటమిన్-ఏ సప్లిమెంటేషన్ సిరప్ ఇస్తుంది.  5 సంవ‌త్స‌రాల‌ లోపు పిల్లల తల్లితండ్రులు అందరూ దగ్గరలోని అంగనవాడి కేంద్రాన్ని సంప్రదించి మీ పిల్లలకి విటమిన్-ఏ సిరప్ వేయించండి. వారి ఆరోగ్య సురక్షితకు జాగ్రత్త తీసుకోండి" అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top