శిలాఫలకాలు చెబుతున్న చరిత్ర

కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సమయంలో సీఎం వైయస్ జగన్ మాటలు ఆలోచింపచేస్తాయి. ఎన్నికలకు ఆరునెలల ముందు టెంకాయి కొట్టేవారికీ, అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే టెంకాయి కొట్టేవారికీ తేడా ఉంటుందని సూటిగా తన చిత్తశుద్ధి గురించి ప్రజలకు వివరించారు జగన్.
చంద్రబాబులా తాను శిలాఫలకాల సీఎంను కానని ఆయన కుండబద్దలు కొట్టేసారు. చెప్పానంటే చేస్తానంతే అన్నది జగన్ సిద్ధాంతం. ఉక్కు పరిశ్రమను మూడేళ్లలో పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తామని చెప్పారు జగన్. 15000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకోసం ఇప్పటికే 250 కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు కూడా చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం.
చంద్రబాబు గత ఐదేళ్ల పాలనా కాలంలో మర్చిపోయిన చాలా విషయాలను కరెక్టుగా ఎన్నికల ముందు గుర్తుకు తెచ్చుకుని గబగబా శంకుస్థాపనలు చేసాడు.
2019 జనవరిలో రాజధాని వారధికి శంకుస్థాపన చేసాడు. ఐకానిక్ వంతెనంటూ కళ్లకి ఐస్ పూసాడు.
ఇదే జనవరిలో జేవియర్ లేబర్ రిలేషన్స్ (XLRI) అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏమైందో తెలీదు.
ఫార్మా క్లస్టర్ కు భూమి పూజ అన్నాడు.
ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు శంకుస్థాపన చేసాడు. వాటి అతీగతీ ఏమిటో తెలీదు.
ఈ జనవరిలోనే నెల్లూరులో దామవరం, చిత్తూరులో కుప్పంలలో ఎయిర్పోర్టులకు శంకుస్థాపనలు చేసేసాడు.
ప్రకాశం జిల్లాలో రామయపట్నం పోర్టు శంకుస్థాపన
ప్రకాశం జిల్లాలో భారీ పేపరు పరిశ్రమకు పునాదిరాయి వేసాడు. ఆరునెల్లైనా ఆ కంపెనీ మళ్లీ ఇటు తిరిగి చూస్తే ఒట్టు.
ఈ కంపెనీ 2500 కోట్ల పెట్టుబడి ఎంఓయూ అక్కడికక్కడే కుదిర్చేసుకుందట. 2500 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందిట.
2019 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా వైకుంఠాపురం బ్యారేజీకి శంకుస్థాపన చేసాడు. భోగాపురం విమానాశ్రయానికీ పునాదిరాళ్లేసేసాడు.
2019 మార్చిలో గుండ్రేవుల, ఎల్.ఎల్.సి, బైపాస్ కెనాల్ లకు శంకుస్థాపనలు చేసేసాడు.
ఇవేనేంటి కడప స్టీలు ప్లాంట్ విశాఖలో ఐ హబ్, విత్తనోత్పత్తి కేంద్రం, మెగా అల్ట్రా ఫుడ్ పార్క్, ఉర్దూ రియలెస్టేటుకు  రాళ్ల కొరతుండేది కాదు.
లేటెస్టు ఐదేళ్లలోనే కాదు, చరిత్రలో ఎనిమిదేళ్ల పాలనా కాలంలో కూడా బాబు ఇదే బాపతు. చంద్రబాబు వేసే పునాదిరాళ్లన్నీ సమాధిరాళ్లే అంటూ అప్పట్లో వైయస్సార్ దుయ్యబట్టారు. బాబు వేసిన రాళ్లెన్నో అందులో అసలు మొదలైనవెన్నో బహిరంగ చర్చకు సిద్ధమా అని 2003లో సవాల్ కూడా విసిరారు.
ఇదండీ విషయం. ఎప్పుడూనాగానీ బాబుకు ఎన్నికలుంటేనే ప్రాజెక్టులు శిలాఫలకాలు గుర్తొస్తాయి. తర్వాత మాత్రం ఆ ప్రాంతంలో గడ్డి, పిచ్చిమొక్కలు మాత్రమే మొలుస్తాయి. 

Back to Top