ప్రతి అడుగూ ప్రగతి దిశగా..

రాష్ట్రాభివృద్ధి సాధ‌నే ల‌క్ష్యంగా  వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు విశేష కృషి

పారిశ్రామిక‌వేత్త‌లు వెన‌క్కి వెళ్తున్నార‌ని ఎల్లో బ్యాచ్ విష ప్ర‌చారం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అపార‌న‌మ్మ‌కం

అమ‌రావ‌తి:  రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఐదేళ్లు అరిష్టం ప‌ట్టింది. అపార అనుభ‌వం ఉంద‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు అధికారం క‌ట్ట‌బెడితే..ఆయ‌న‌, ఆయ‌న బినామీలు మాత్ర‌మే అభివృద్ధి చెందారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ పాల‌న సాగించిన చంద్ర‌బాబుకు ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పారు. యువ‌కుడు, ఉత్సాహ‌వంతుడు, మాట త‌ప్ప‌ని, మ‌డ‌మ తిప్ప‌ని నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప‌ట్టం క‌ట్టి ముఖ్య‌మంత్రిని చేసుకున్నారు. పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన రెండు నెల‌ల్లోనే దేశానికే దిక్కూచిగా మారేలా సంక్షేమ ప‌థ‌కాలు, చారిత్రాత్మ‌క చ‌ట్టాలు చేయ‌డంతో వైయ‌స్ జ‌గ‌న్ పేరు మారుమ్రోగుతోంది. అవినీతి నిర్మూల‌న‌, పార‌ద‌ర్శ‌క‌త‌, సుస్థిర ప్ర‌భుత్వం ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఎల్లోబ్యాచ్ విష ప్ర‌చారానికి తెర లేపింది. 
అస‌త్యాల‌ను ప్ర‌చారం చేయ‌డంలో దిట్ట అయిన ఎల్లోమీడియా  ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం మొద‌లు పెట్టింది. చంద్ర‌బాబు హ‌యాంలో బాగా పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్త‌లు ముందుకు వ‌చ్చార‌ని, అప్ప‌ట్లో వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌లు కూడా ఇప్పుడు వెన‌క్కి వెళ్తున్నాయ‌ని ప్ర‌చారం చేస్తోంది.  అయితే దీనిపై సాక్షాత్తు ప్ర‌భుత్వ ముఖ్యకార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం స్పందిస్తూ ఇది ముమ్మ‌టికీ అస‌త్య ప్ర‌చార‌మేన‌ని కొట్టిపారేశారు. ఏసియ‌న్‌ ప‌ల్ప్ అండ్ పేప‌ర్ కంపెనీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వెన‌క్కు వెళ్తున్న‌ట్లు చేస్తున్న ప్ర‌చారంలో కూడా నిజం లేద‌ని, ఇప్ప‌టికీ ప్ర‌భుత్వం వారితో స‌త్సంబంధాలు క‌లిగి ఉంద‌న్నారు. ఇలాంటి దుష్ప్ర‌చారాలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌పై పారిశ్రామిక వేత్త‌ల‌కు అపార‌న‌మ్మ‌కం ఉంద‌ని పేర్కొన్నారు. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు తీసుకువ‌చ్చేందుకు చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌న్నారు.

న‌వ శ‌కానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాందీ ప‌లికారు.  ప్ర‌జ‌ల క‌ల‌లు సాకారం చేసేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నాయకత్వంలో  ప్ర‌భుత్వం ముందుకు పోతుంది.   రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం రాష్ట్ర‌ పునర్నిర్మాణానికి,  తెలుగు ప్ర‌జ‌ల‌ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడానికి దివంగ‌త మ‌హానేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌యాల‌కు అనుగుణంగా వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న సాగిస్తున్నారు.   చారిత్రక చ‌ట్టాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తూ రాష్ట్రానికి నూతన రూపం తీసుకువ‌స్తున్నారు. ఐదేళ్లు పాలించిన తెలుగుదేశం పార్టీ ప్ర‌జ‌ల క‌ష్టాలు, న‌ష్టాల‌ను ఏ నాడు ప‌ట్టించుకోలేదు. దోచుకోవ‌డం, దాచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేశారు. ప్ర‌తి ప‌నిలోనూ అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల‌ను మార్చుతూ వైయ‌స్ జ‌గ‌న్ పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట వేస్తూ నిర్ణ‌యాలు తీసుకున్నారు. మొట్ట మొద‌టి అసెంబ్లీ స‌మావేశాల్లోనే 19 బిల్లుల‌కు ఆమోదముద్ర వేసి చ‌రిత్ర సృష్టించారు. ప‌ద‌వులు, ప‌నుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించారు. స్థానిక యువ‌త‌కు ప‌రిశ్ర‌మ‌ల్లో 75 శాతం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేలా చ‌ట్టం చేశారు. ఈ నిర్ణ‌యాన్ని పారిశ్రామిక‌వేత్త‌లు స్వాగతించారు. 

పార‌ద‌ర్శ‌క పాల‌న‌తో ముందుకు
 ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి న‌మ్ముతున్నారు.  పెట్టుబడుల ఆకర్షణకు అవినీతి రహిత పాలన అవసరమని ఆయ‌న విశ్వాసం. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం పారదర్శక పాలనతో ముందుకు వెళుతోంది.  అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవ‌ల విజయవాడలో పెట్టుబడుల అవగాహన సదస్సు నిర్వ‌హించ‌గా 30 దేశాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంలో రాష్ట్ర ప‌రిస్థితులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుకూల‌మైన అంశాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌వివ‌రంగా తెలిపారు.  ‘రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. మాకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలాంటి మెట్రో సిటీలు లేకపోవడం ఇబ్బందికరమే. మా బలహీనతలు మాకు మీకు తెలుసు. కానీ మా బలాలు కూడా మీకు చెప్పాలి. సుదీర్ఘ తీర ప్రాంతం, మంచి వనరులు మా సొంతం. సుస్థిర ప్రభుత్వం మాది. అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన అందిస్తున్నాం. ఇటీవల చట్ట సభలోను చట్టం చేశాం. విప్లవాత్మక నిర్ణయాలను కూడా తీసుకున్నామ‌ని పేర్కొన్నారు.  

ఇవే ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌లం..
ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి  970 కిలోమీటర్ల కోస్టల్‌ లైన్‌, నాలుగు ఓడ రేవులు, ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఇది ఏపీ బలం. ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. 86శాతం సీట్లు  వైయ‌స్ఆర్‌సీపీ గెలుచుకుంది. పార్లమెంట్‌ సీట్ల పరంగా చూస్తే దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీ. పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా ఉన్నాయి.   పారదర్శకమైన విధానాలు, అవినీతి రహిత పాలనకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది.  పెట్టుబడులు పెట్టేవారికి ధైర్యం కల్పించే బాధ్యత సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తీసుకున్నారు.  

ప్ర‌వాసాంధ్రుల ఆస‌క్తి
 ప్రవాసాంధ్రులు మన (ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్రానికి వచ్చి ఆయా రంగాల్లో విరివిగా పెట్టుబడులు పెట్టాలని, అందుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపున‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.  అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ డాలస్‌లోని హచిన్‌సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో  వేలాది మంది ప్రవాసాంధ్రులను ఉద్దేశించి  ప్ర‌సంగించారు. సామాజిక న్యాయం కోసం తీసుకున్న నిర్ణయాలను వివరించారు. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలన్న తన తపనకు ప్రవాసులు కదలి రావాలని, మీరు, మనము అందరమూ కలిసి ఏపీ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదామని వారందరినీ కోరారు.   ``మెట్టు మెట్టుగా అభివృద్ధి పథంలో పయనిద్దాం. ఎల్లోబ్యాచ్ విష ప్ర‌చారాన్ని, కుట్రలను తిప్పికొడ‌దాం`` ఇదే నినాదంతో ప్ర‌భుత్వం ముందుకు వెళ్తోంది.

Back to Top