పోలవరం..ప‌చ్చ నేత‌ల‌కు వ‌రం  

1981లో నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన 

దివంగ‌త నేత‌ వైయ‌స్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవగానే 2004లో కదలిక

2007లో కేంద్ర గిరిజన శాఖ అనుమతులు 

 2014లో జాతీయ ప్రాజెక్టుగా  కేంద్రం ప్ర‌క‌ట‌న‌

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం   చేసింది అర‌కొర ప‌నులు మాత్ర‌మే

అమ‌రావ‌తి:  పోలవరం ప్రాజెక్టు ఆలోచనకు పునాది స్వాతంత్రానికి ముందే పడింది. 1941లో నాటి అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య ఇంజనీరు ఎల్.వెంకటకృష్ణ అయ్యర్, పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఈ ప్రాజెక్టుకు రామపాదసాగర్ అని పేరు పెట్టారు. దీని అంచనా వ్యయం రూ.129 కోట్లు. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల అవసరాలకు నీటి తరలింపు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడం, విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు మరో 143 కిలో మీటర్ల కాలువ నిర్మించడం దీని ప్రధాన లక్ష్యాలు.

రామపాదసాగర్ డిజైన్ పూర్తి అయినప్పటికీ నిర్మాణ పరంగా అడుగు ముందుకు పడలేదు. దీనికి రెండు ప్రధాన కారణాలుః ఒకటి ప్రాజెక్టు వ్యయం. రెండు నిర్మాణ సంక్లిష్టత. 1953లో గోదావరికి వరదలు వచ్చాయి. ఎంతో నీరు వృథాగా సముద్రంలోకి పోయింది. మరోవైపు (విశాఖ స్టీల్ ప్లాంట్ కు నీటి అవసరాలు అంతకంతకూ పెరిగాయి.దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలతో కొన్ని ఒప్పందాలు జరిగాయి. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలు 1980 ఏప్రిల్ 2న ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎఫ్ఆర్ఎల్, పూర్తి నీటి మట్టం 150 అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం, స్పిల్ వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు. పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిశా, మధ్యప్రదేశ్ (ఇప్పుడు ఛత్తీస్ ఘ‌డ్) రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. వీటికి ఆంధ్రప్రదేశ్త గిన పరిహారం చెల్లించాలి. 1976లో పోలవరంకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు తయారుచేశారు.

1981లో నాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1986లో తుది నివేదిక సిద్దమైంది. 1986 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2665 కోట్లు. తరువాత మరల మరుగున పడింది. తిరిగి దివంగ‌త నేత‌ వైయ‌స్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవగానే 2004లో దీనికి కదలిక వచ్చింది. వారు ఆలస్యం లేకుండా నిర్మాణాన్ని ప్రారంభించారు. 2005లో దీనికి పర్యావరణ అనుమతులు వచ్చాయి. గిరిజన ప్రాంత ప్రజల తరలింపు, వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించి కేంద్ర గిరిజన శాఖ అనుమతులు 2007లో లభించాయి. అట‌వీ ప్రాంత వినియోగానికి సంబంధించిన తుది అనుమతులు 2010లో వచ్చాయి. తరువాత పోలవరాన్ని 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఇది
రాష్ట్ర విభజన వలన వచ్చిన కానుక. దీనితో ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఖర్చు భరిస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర భజనకు ముందే 5వేల కోట్లు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది. 2014 తర్వాత అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాంట్రాక్టర్ కూడా పాత ప్రభుత్వ పాలనతోనే నియంచబడ్డారు. దీనిని కూలంకషంగా చూస్తే మనకేమి అర్ధమవుతుంది. ప్రాజెక్టు పని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే ప్రారంభమైంది. 5000 కోట్ల పై చిలుకు రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ప్రాజెక్టు అనుమతులన్నీ కూడా అప్పుడే వచ్చాయి. కాంట్రాక్టర్ ని కూడా అప్పుడే ఖరారు చేశారు. ప్రస్తుత ఖర్చంతా కేంద్రం భరిస్తుంది. మరి టి.డి.పి. ప్రభత్వం మాత్రం, అంతా తాము చేస్తున్నట్లు నాటక డుతున్నారు.
 పని చేయించేది ఉద్యోగస్తులు. చేసేది కాంట్రాక్టర్లు. డబ్బు ఇచ్చేది కేంద్రం.అందుకనే, దయచేసి, రాష్ట్ర ప్రభుత్వం తమ టీవీ చానెల్స్, పత్రికల ద్వారా చేసే ప్రచారాన్ని నమ్మవద్దు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కోసం చేసింది అతి తక్కువ.  

తాజా వీడియోలు

Back to Top