ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద తొలగించిన ఓట్లు 25 లక్షల 47,000 ఒక్క రాజధాని ప్రాంతం అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొలగించిన ఓట్ల సంఖ్య 600000 (6లక్షలు) అని ఎన్నికల కమీషనే చెబుతోంది. లోకేష్ పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది. ఈ జిల్లాలో భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించారు నరసరావు పేటలో 20,200 చిలకలూరిపేటలో 7,000 లోకేష్ పోటీ చేయనున్నాడని చెబుతున్న మంగళగిరిలో 23,500 ఓట్లు తొలగించారు. వీరంతా ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత పక్కాగా పోయిన ఓట్లు ప్రతిపక్ష పార్టీకి చెందినవారివే అని చెప్పడానికి సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి. మంగళగిరి ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీల ఓట్లను కూడా అక్రమంగా తొలగించారు. అంతేకాదు 13,000 దొంగ ఓట్లు సృష్టించినట్టు కూడా తమ దృష్టికి వచ్చిందని ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులు చేసారు. సత్తెనపల్లిలో ప్రతిపక్ష నాయకుడు అంబటి రాంబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లన్నీమాయం చేసారు. విపక్షంలో ఉన్న నాయకుల ఓట్లనే తీసేస్తుంటే సామాన్యుల ఓట్లకు భద్రత ఉంటుందా? సర్వేలు చేసి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకం అనిపించిన వారి ఓట్లన్నిటినీ తొలగిస్తున్నారని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అక్షరాలా నిజమని ఈ సంఘటనలే నిరూపిస్తున్నాయ్. ఐటీ శాఖా మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ ను మంగళగిరి నుంచి పోటీ చేయించడానికి కారణం కూడా పెద్ద ఎత్తున అక్కడి ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడం వల్లే అని తెలుస్తోంది.