హ్యాట్సాఫ్‌ జగనన్న..వాలంటీర్లకు వందనం

కరోనా వైరస్‌ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లు

క్షేత్రస్థాయిలో కచ్చితమైన సమాచారం అందిస్తున్న వాలంటీర్లు

ముఖ్యమంత్రి ముందు చూపుపై ప్రశంసల జల్లు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏది చేసినా ఒక అర్థం ఉంటుంది. ఆయన చేసే ప్రతి దాంట్లో భవిష్యత్‌ ఉంటుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేశారు. వీరు క్షేత్రస్థాయిలో సంబంధిత ఇళ్లకు బాధ్యులుగా ఉంటూ సంక్షేమ పథకాలను గుమ్మం వద్దకు చేర్చడమే కాకుండా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా ఉంటూ వారి సమాచారాన్ని ప్రభుత్వాన్ని చేరవేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చిన వలంటీర్ల సత్తా ఏమిటో ఇప్పుడు తెలిసింది. ప్రజల ప్రాణాలను సచివాలయం ఉద్యోగులు, వలంటీర్లే కాపాడుతున్నారు.  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్టంగా కృషి  చేస్తోంది.   

విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం సేకరణ
గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటా సర్వే నిర్వహించి విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. రోజూ గృహనిర్బంధంలో ఉన్న వారి ఇళ్లకు వైద్య సిబ్బంది వెళ్లి బీపీ, షుగర్, జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలను పరీక్షిస్తున్నారు.  

ఏపీలోనే ఫస్ట్‌..
అసలు ఏ దేశంలో అయినా.. ఏ రాష్ట్రంలో అయినా విదేశాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. కానీ ఎవరు వచ్చారు? ఎక్కడ తిరుగుతున్నారు? అని ఇన్ఫర్మేషన్‌ ఎవరికీ తెలియదు.  కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముందుచూపుతో సంక్షేమ పథకాల అమలుకు ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్లను నియమించడం జరిగింది. వాళ్ళు ఈ దుర్భర పరిస్థితిలో చాలా ధైర్యంగా ఎప్పటికప్పడు ప్రతి ఇంటికి తిరిగి విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా లేదా అనేది తెలుసుకుంటూ ఇన్ఫర్మేషన్‌ ప్రభుత్వానికి అందిస్తున్నారు. దానివల్ల ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్‌ జరిపి ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం ప్రభుత్వానికి సులభతరం అయ్యింది. తద్వారా వారిని ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తూ తగిన సలహాలు, సూచనలు ఇస్తూ వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా నిరోధించే పని చాలా సులువైంది. ఇంతకు ముందే సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరవేయడంలో ప్రజల మెప్పు పొందిన  ఈ వాలంటీర్లు ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా  ప్రజలకు సేవ చేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఎంతైనా వై యస్‌ జగన్‌ ఆలోచన సూపర్‌ అంటూ ప్రత్యర్థి పార్టీలు సైతం కొనియాడుతున్నాయి.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న చర్యలు అభినందనీయమని ప్రకటించడం, వాలంటీర్ల వ్యవస్థను పలువురు మెచ్చుకోవడం ఇదంతా వైయస్‌ జగన్‌ ముందు చూపే. అందుకే అందరూ హ్యాటాప్స్‌ జగనన్న..వార్వెవ్వా వాలంటీర్లు అంటూ కొనియాడుతున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top