గూగుల్‌లో ట్రెండ్స్ సృష్టిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌

సోష‌ల్ మీడియాలో జ‌న‌నేత‌కు విశేష స్పంద‌న‌

రోజు రోజుకు వెనుక‌బ‌డుతున్న చంద్ర‌బాబు

 అమ‌రావ‌తి: జనాల నాడి ఏమిటో పసిగట్టడానికి ఇప్పుడు గూగుల్ అతి కీలకమైనది. ఇంటర్నెట్ మీద అవగాహన ఉన్న వాళ్లెవరైనా ఈ మాట చెబుతారు. ఈరోజు ఉదయం లేస్తే... పెద్ద పెద్ద మీడియా హౌస్ లు కూడా గూగుల్ లో ఏం ట్రెండ్ అవుతోందనే అంశం గురించినే కసరత్తును మొదలుపెడతాయి. దీనికోసం సెర్చ్ ఇంజన్ అప్టిమైజేషన్ ఎక్స్ పర్ట్స్ ను నియమించుకుని... ట్రెండ్స్ ను పట్టుకునేందుకు కసరత్తు సాగిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ మీడియా హౌస్ లన్నీ ఇప్పుడు ఇదే పనిచేస్తూ ఉన్నాయి. గూగుల్ ట్రెండ్స్ వాటన్నింటికీ మార్గదర్శకాలు.

జనాలు ఏ అంశం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనేది గూగుల్ ట్రెండ్స్ చెబుతుంది. టాపిక్ వారీగా, ట్రెండ్ అవుతున్న పేర్ల వారీగా గూగుల్ ట్రెండ్స్ ను చూపిస్తూ ఉంటుంది. అలాంటి గూగుల్ ట్రెండ్స్ మ్యాప్ లో ఏపీ పాలిటిక్స్ లోని ఇద్దరు ప్రధాన నేతల మధ్యన పోలిక ఇది.

గత నెలరోజులుగా గూగుల్ లో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు అనే పేర్లు ఏ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి అనే అంశం గురించిన గ్రాఫ్ ఇది. మార్చి రెండో తేదీ నుంచి వైయ‌స్ జగన్ గ్రాఫ్ అలా పైపైకి వెళ్తోంది. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ మాత్రం జగన్ కు చాలా దిగువన కింద కిందే తచ్చాడుతూ ఉంది.

ఎక్కడా వైయ‌స్ జగన్ కు సమీపంలోకి కూడా రాలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు. ఇంట్రెస్ట్ ఓవర్ టైమ్ లో జగన్ గ్రాఫ్ 75 మార్కును అందుకోగా.. చంద్రబాబు నాయుడి గ్రాఫ్ 25 వద్ద ఉంది. ఇంటర్నెట్ లో తెలుగు రాజకీయాల గురించి సెర్చ్ చేసేవాళ్లు దృష్టికూడా వైయ‌స్ జగన్ మీదే ఉంది తప్ప బాబు మీద కాదని గూగుల్ ట్రెండ్స్ గ్రాఫ్ స్పష్టం చేస్తోంది! ఏపీ ఎన్నికల వేళ బాబు పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవడానికి ఇదీ ఒక రుజువు.
కాగా ఇటీవ‌ల నిర్వ‌హించిన జాతీయ స‌ర్వేలు, లోక‌ల్ స‌ర్వేలు కూడా వైయ‌స్ జ‌గ‌న్‌కే మొగ్గు చూపుతున్నాయి. కాబోయే సీఎం జ‌గ‌నే అంటూ కోడై కూస్తోంది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబులో కూడా ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది. నిన్న‌టి స‌భ‌లో ఇదే విష‌యాన్ని ఒప్పుకున్నారు. తాను ఓడిపోతే ఇంట్లో భార్య‌, మ‌న‌వుడు, కోడ‌లు ఉన్నార‌ని చెప్పారు. ఈ మాట‌ల‌ను అర్థం చేసుకున్న నెటిజ‌న్లు బాబుకు త‌త్వం బోధ ప‌డింది. ఏది ఏమైనా ప్ర‌జ‌లు మార్పుకే ఓటు వేస్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

Back to Top