జగనన్న పాలన.. పల్లెకు పండగొచ్చింది

అమరావతి: సంక్రాంతి అంటేనే పల్లెకు ప్రత్యేక కళ వస్తుంది. పచ్చని పంట పొలాలు, ఇంటికి చేరిన ధాన్యం రాశులతో రైతన్నలు సంతోషంగా ఉండే సమయంలో ఈ పండుగ వస్తుంది. నాడు కరువు కాటకాలు, కరెంట్‌ కోతల మధ్య కష్టాలు, అప్పులతో తల్లడిల్లిన కుటుంబాల్లో సంక్రాంతి సంబురాలు అంతగా కనిపించేవి కావు. కానీ, జగనన్న పాలనలో ఊరు మారింది.. సంక్రాంతితో సంబంధం లేకుండా పల్లెకు పండగొచ్చింది. అది ఎలా ఉందంటే..

వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం
విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

గ్రామ సచివాలయం
గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గడప వద్దకే 540కి పైగా ప్రభుత్వ సేవలు అందించేలా 15,004 గ్రామ/ వార్డు సచివాలయాలు ఏర్పాటు, 1,35,819 మంది శాశ్వత ఉద్యోగులు, 2.60 లక్షల నుంది వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు.

డా. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్
2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో మొత్తం 10,132 విలేజ్ హెల్త్ క్లీనిక్లు, ఉచిత  వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో సేవలు అందిస్తున్నారు. 

మనబడి "నాడు-నేడు”
కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం, డిజిటల్ బోధనతో మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ రూ.17,805 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునికీకరణ మూడు దశల్లో.. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు.. బై లింగువల్ టెక్స్ట్ బుక్స్ బైజూస్ కంటెంట్.. జగనన్న గోరుముద్ద. విద్యా కానుక అమలు చేస్తున్నారు.

వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ
వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్టును బలోపేతం చేసే దిశగా, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు 12,979 పంచాయతీల్లో కడుతున్న వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు, అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో అందుబాటులోకి తీసుకువచ్చారు.

అంగన్వాడీ కేంద్రం
పిల్లలు, గర్భిణీలు, బాలింతల పోషణ, బంగారు భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్ వాడీ కేంద్రాలు.. నాడు-నేడు ద్వారా అంగన్వాడీలో మంచి వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా వేగంగా అడుగులు.. సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ ద్వారా బలవర్ధక ఆహారం అందిస్తున్నారు.

వలంటీర్ల సేవలు
దరఖాస్తు చేసుకోవడం నుండి లబ్ది పొందే వరకు లబ్దిదారుల చేయి పట్టుకొని నడిపిస్తూ వారి గడప వద్దనే సేవలు అందిస్తున్న 2.60 లక్షల మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు.

 

తాజా వీడియోలు

Back to Top