ఇవిగో నవరత్నాల వెలుగులు

నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న యజ్ఞం

మానవాభివృద్ధే ధ్యేయంగా పథకాల అమలు

జీవన స్థాయిలు పెరిగి  పేద వర్గాల ముందడుగు

విత్తు నాటిన వెంటనే చెట్టయిపోదు. ఫలించడానికి దానికి సమయమివ్వాలి. ఈలోగా సంరక్షించాలి. ఇదిగో.. రాష్ట్రంలో ఇపుడా ఫలాలు కనిపి­స్తున్నాయి. ఎన్నికలకు వెళ్లే ముందు మాయమాటలు చెప్పి... గెలిచాక మరిచిపోయే కుటిల రాజకీయాలకు స్వస్తి చెప్పారు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 2019లో ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను... గెలిచిన క్షణం నుంచే మనసా వాచా ఆచరణలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. కోవిడ్‌ చుట్టుముట్టి యావద్దేశాన్నీ అతలాకుతలం చేసినా... రాష్ట్రం సైతం ఆరి్థకంగా తల్లకిందులైనా... ఆడిన మాట తప్పలేదు. ఆరంభించిన ఏ పథకాన్నీ ఆపలేదు. 
ఫలితం... ‘అమ్మ ఒడి’తో స్కూళ్లలో చదువుకునే పిల్లల సంఖ్య పెరిగింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను అన్నట్టే రూ. 3,000 వరకూ పెంచుకుంటూ వెళుతుండటంతో వారికి ఆసరా దొరికింది. డ్వాక్రా రుణాల మాఫీతో మహిళలు తలెత్తుకు నిలబడ్డారు. 
నగదు జమచేసి రైతుకు భరోసా కల్పించటమే కాదు. ఈ–క్రాప్‌తో ఉచితంగా నూరుశాతం బీమా చేయించి పంటనష్టమనే భయం లేకుండా చేశారు. రైతు భరోసా కేంద్రాలతో వ్యవసాయాన్ని లాభసాటి చేశారు. చరిత్రలో తొలిసారి ఉచితంగా ప్రతి పేద మహిళకూ ఇంటి స్థలాన్నివ్వటమే కాక.. ఇళ్ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు.
‘నాడు–నేడు’తో స్కూళ్లు, ఆసుపత్రుల రూపు రేఖలనే మార్చేశారు. విద్యాకానుక, గోరుముద్ద, వసతి దీవెన పేరిట విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. 
ఇక ఆరోగ్య రంగంలో తెచి్చన సంస్కరణలు అమూల్యం. ఆసుపత్రుల రూపురేఖల్ని మార్చటమే కాదు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి దాదాపు ప్రతి చికిత్సా వచ్చేలా ప్రొసీజర్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్‌ను పంపించి, ఉచితంగా మందులిస్తూ పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఇలా చెబుతూ వెళితే ఐదేళ్లలో ఇన్ని చేయటం సాధ్యమా? అనే ఆశ్చర్యం కలగకమానదు. కాకపోతే సంకల్పం కన్నా శక్తిమంతమైనదేదీ లేదని నిరూపించారు వైఎస్‌ జగన్‌.  అందుకే.. ఆ ‘నవరత్నాల’ వెలుగుల్ని ఆయా లబ్ధిదారుల మాటల్లోనే చూపించే ప్రయత్నం .
 
నా ప్రాణం నిలబెట్టారు..

మాది టెక్కలి సమీపంలోని రాందాస్‌పేట. శ్రీకాకుళం జిల్లా. నేను టెక్కలి రోడ్డులో కొబ్బరికాయలు అమ్ముకుంటూ బతుకుతున్నాను. గతేడాది ఆరో నెలలో ఎక్కువగా గుండె వద్ద నొప్పి వస్తుంటే... అందరూ గ్యాస్టిక్‌ నొప్పి అని చెప్పారు. శ్రీకాకుళంలోని పెద్ద డాక్టర్‌కు చూపిస్తే్త వెంటనే ఆపరేçషన్‌ చెయ్యాలని చెప్పారు. అప్పుడే నా గుండె ఆగినంత పనైంది. మా ఆవిడ అమ్ములమ్మతో కలిసి తిరిగి మా ఊరొచ్చేశాము. దిగాలుగా ఉండిపోయాం. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లి చేసేశాను. ఇంకా ఒక పిల్ల ఉంది. మేము రోజంతా రోడ్డు మీద కొబ్బరికాయలు, పళ్లు అమ్మితేనే ఇళ్లు గడుస్తుంది. ఏం చెయ్యాలిరా దేవుడా అని బెంగపడ్డాను.

వైయ‌స్ఆర్‌ ఆరోగ్య­శ్రీతో ఈ డబ్బులు లేకుండానే ఆపరేషన్‌ చేస్తారని ఎవరో మా ఆవిడకి చెప్పారు. వెంటనే టెక్కలి ఆస్పత్రికి వెళ్లి నా జబ్బు కోసం చెప్పాను. ఇలా చెప్పానో లేదో నాలుగైదు రోజు ల్లోనే ఆపరేషన్‌ చేయిస్తామని కబురు చెప్పారు. శ్రీకాకుళం కిమ్స్‌ ఆసుపత్రిలో ఆపరేçషన్‌ చేశారు. పది రోజులు అక్కడే ఉన్నాం. వెంటనే పనికి వెళ్లలేనని ఆసరా పథకం అంటూ పది వేలు నగదు నా ఖాతాకు వేశారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేకపోతే..నాలాంటి పేదోడికి దిక్కేది చెప్పండి. నాకోసం రూ.4.30 లక్షలు వరకు ఈ ప్రభుత్వం భరించింది. ఈ ఆరోగ్యశ్రీ యే నా ప్రాణం నిలబెట్టింది. ఇప్పు­డైతే నా ఆరోగ్యం బాగానే ఉంది. ఉన్న ఆడపిల్లకు పెళ్లి చేసేశాను. ఆనందంగా ఉన్నాను.
– బోర రామ్మూర్తి, రాందాస్‌పేట
 
మా రెక్కల కష్టానికి మద్దతు 

మాది ప్రకాశం జిల్లా నాగులుప్పల­పాడు మండలం ఒమ్మెవరం. పదేళ్ల క్రితం వివాహమైంది. మా కుటుంబంలో నేను చిన్న కోడలిని. మాకు సెంటు భూమి కూడా లేదు. భార్య­భర్తలమిద్దరం రెక్కల కష్టం మీదే ఆధా­రపడి జీవిస్తున్నాం. ఒక్క రోజు కూలికి వెళ్లక­పోతే ఆ రోజు పస్తు ఉండాల్సిందే. కూలి పను­లకు వె­ళ్తూ­నే మా ఇద్దరు బిడ్డలు జాస్మిన్‌ (8వ తర­గతి), అమర్‌ (7వ తరగతి)లను చదివించు­కోవాలి. వారికి మంచి దుస్తులు, పుస్తకాలు కొనాలంటే మాలాంటి వారికి తలకు మించిన భారమే. ఈ దుస్థితిలో మా బిడ్డల్ని ఎలా చది­వించాలి అని మథనపడేవాళ్లం. వారు పెద్ద­వుతున్న క్రమంలో ఇంకా భయం పట్టుకొంది. పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే మా వల్ల కాదు.

మాలాగా మా పిల్లలు ఉండకూ­డదు. వారిని ఉన్నత చదువులు చదివించాల­నేదే నా ముందున్న పెద్ద సవాలు. కానీ మాకు ఆ స్తోమత లేదు. అలాంటి సమయంలో నాలుగేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మ ఒడి పథకం మాకు కొండంత ఆసరాగా నిలిచింది. నాలుగేళ్లుగా నా బ్యాంక్‌ అకౌంట్‌లో నేరుగా డబ్బులు పడుతున్నాయి. వాటితో మా బిడ్డలకు కావల్సిన ఇతరత్రా వస్తువులు కొనుక్కుంటున్నాము. ఒకప్పుడు స్కూళ్లు తెరుస్తున్నారంటే ఎంతో భయపడి­పోయేవాళ్లం. వారికి ఏ విధంగా డబ్బులు సమ­కూర్చాలి? ఎక్కడ అప్పు చేయాలి..? అని మేమిద్దరం నెల రోజుల­పాటు ఆలోచించేవాళ్లం. ఎంతమందిని అడి­గినా అప్పు పుట్టేది కాదు. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్‌ ఏమిటా అని భయపడేవాళ్లం. కానీ అమ్మ ఒడి రూపంలో ఆ దేవుడే కరుణించాడు. ఈరోజు ఏపీలో మా లాంటి నిరుపేదల పిల్లలకు మంచి చదువు దొరుకుతోంది. తొందరలో మాకు సొంతింటి కల నెరవేరనుంది. 
    – అత్తంటి యేసుమ్మ, ఒమ్మెవరం
 
ఇదిగో మా సొంతిల్లు

అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని సిబ్యాలకు చెందిన మేము 30 ఏళ్ల క్రితం ముగ్గుÆ­ý‡ు కొడుకులతో కలిసి బతుకుదెరువు కోసం మదనపల్లెకు వలస వచ్చాం. నీరు­గట్టు­వారిపల్లె చౌడేశ్వరినగర్, మాయాబ­జార్‌ ఇంకా చానా చోట్ల అద్దె ఇళ్లల్లో ఉన్నాం. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్లం. ముగ్గురు బిడ్డలకు పెళ్లిళ్లయ్యాక జీవనోపాధికి మగ్గాలు నేసుకునేందుకు వేర్వేరుగా వెళ్లిపో­యారు. మాకు వయసై పోవడంతో చంద్ర­బాబు ఉన్నప్పుడు సొంతింటి కోసం తిరిగాము. చేతిలో అర్జీ పెట్టుకొని తిరగని ఆïఫీసంటూ లేదు. చేతులెత్తి మొక్కని ఆఫీసర్‌ లేడు..   చెప్పులరిగిపోయాయేగానీ పెద్దసార్ల మనసు కరగలేదు.

తహసీల్దార్, మున్సిపాలిటీ ఆఫీస్‌ వద్ద చాలా సార్లు అర్జీ­లు ఇచ్చాము. తలదాచుకునేందుకు ఓ చిన్న గూడు కట్టుకుందామన్నది మా ఆశ. అది ఈ జన్మలో తీరద­నుకుని ఆశ వదిలేసుకున్నాం. ఓ రోజు మా ఇంటికి వలంటీర్‌ రోజా ‘పెద్దయ్య, పెద్దమ్మా.. మీకు ఇల్లు మంజూరు చేస్తే కట్టుకుంటారా’అంటూ మా దగ్గరికొచ్చింది. ఇది కూడా వట్టి మాటలే అనుకున్నాం. కొన్ని రోజులుపోయాక శ్రీవారినగర్‌ సమీపంలో ఇల్లు మంజూరైందని చల్లని కబురు చెప్పింది. పట్టా కూడా చేతికి రావడంతో నమ్మలేకపో­యాం. ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో, మా కష్టంతో ఇల్లు 
ఇలా కట్టుకున్నాం. 
    – సుబ్బరామయ్య, రాములమ్మ దంపతులు

తాజా వీడియోలు

Back to Top